టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి( Sai Pallavi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమెకు ఉన్న క్రేజ్ గురించి ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సినిమా సినిమాకు తనకున్న క్రేజ్ ని ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంటూ వెళ్తోంది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య అభిమానించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.
ఇకపోతే సాయి పల్లవి ఇటీవలే అమరన్ మూవీ తో( Amaran ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో ఈమె క్రేజ్ మరింత పెరిగింది.
అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.ఇకపోతే ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తాను జాతీయ అవార్డు( National Award ) కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

అందుకొక బలమైన కారణం కూడా ఉందని చెప్పారు.ఇంతకీ ఆ కారణం ఏమిటి అన్న విషయానికొస్తే…జాతీయ అవార్డు అందుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది.ఎందుకంటే నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా మామ్మ ఒక చీర ఇచ్చింది.పెళ్లి చేసుకున్నప్పుడు దానిని కట్టుకోమని చెప్పింది.అప్పటికి నేనింకా సినిమాల్లోకి రాలేదు.కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు దానిని కట్టుకుందామనుకున్నాను.
ఆ తర్వాత మూడేళ్లకు సినిమాల్లోకి అడుగుపెట్టాను.నా తొలి చిత్రం ప్రేమమ్ సినిమా( Premam Movie ) కోసం వర్క్ చేశాను.
సినిమా పరిశ్రమలోకి వచ్చిన తొలి నాళ్లలో ఏదో ఒక రోజు తప్పకుండా ఒక ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంటానని నమ్మాను.జాతీయ అవార్డు అంటే ఆ రోజుల్లో ఎంతో గొప్ప.

కాబట్టి దానిని అందుకున్న రోజు ఈ చీర కట్టుకుని అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నాను.దానిని అందుకున్నా, అందుకోకపోయినా, ఈ చీర ధరించే వరకూ నాపై ఒత్తిడి ఉంటూనే ఉంటుంది అని సాయిపల్లవి తెలిపారు.గార్గి చిత్రానికి( Gargi Movie ) గాను సాయి పల్లవికి జాతీయ అవార్డు వరిస్తుందని ఆమె అభిమానులు ఎంతో ఆశపడ్డారు.కాకపోతే చివరకు నిరాశ ఎదురైంది.ఆ ఏడాది నిత్యా మేనన్‌ను నేషనల్ అవార్డు వరించింది.ఇకపోతే సాయిపల్లవి కథానాయికగా నటించిన రీసెంట్ మూవీ తండేల్.
( Thandel ) ఇందులో నాగచైతన్య హీరోగా నటించిన విషయం తెలిసిందే.చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ దీనిని నిర్మించారు.