టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో విశ్వక్ సేన్( Vishwak Sen ) ఒకరు.విశ్వక్ సేన్ లైలా సినిమా( Laila Movie ) బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.
లైలా సినిమా కలెక్షన్లు కోటి రూపాయలకు అటూఇటుగా ఉన్నట్టు సమాచారం అందుతోంది.విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ నాలుగు కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.
అయితే విశ్వక్ సేన్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ సినిమాలకు విశ్వక్ సేన్ దర్శకత్వం వహించగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి.
విశ్వక్ సేన్ ఇప్పుడు తన సినిమాకు తానే దర్శకత్వం వహించట్లేదు కానీ సినిమాలో డైరెక్టర్ గా కనిపించనున్నారు.కేవీ అనుదీప్( KV Anudeep ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

విశ్వక్ సేన్ కేవీ అనుదీప్ కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.విశ్వక్ సేన్ తర్వాత సినిమాలతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.లైలా సినిమాకు కొన్ని ప్రముఖ వెబ్ సైట్లు 0.5, 1 రేటింగ్ ఇచ్చాయి.విశ్వక్ సేన్ కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తే కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పవచ్చు.

విశ్వక్ సేన్ ఇతర భాషలపై కూడా దృష్టి పెడితే కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించే చహన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.కొంతకాలం పాటు విశ్వక్ సేన్ కొత్త డైరెక్టర్లకు దూరంగా ఉంటే మంచిదని వేగంగా సినిమాలను రిలీజ్ చేయడం కూడా విశ్వక్ సేన్ కు మైనస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విశ్వక్ సేన్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోనున్నారో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.