త్రేతాయుగంలో రాక్షసులను సంహరించడానికి కోసం సాక్షాత్తు విష్ణుమూర్తి ఏడో అవతారంగా శ్రీరామచంద్రుడిగా దశరథ, కౌసల్య దంపతులకు చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు.త్రేతాయుగంలో నరుడిగా జన్మించిన శ్రీరామచంద్రుడు ప్రజల పాలిట నారాయణుడిగా మారారు.
రామరాజ్యంలో ప్రజలకు కష్టాలు లేకుండా ఎంతో సుఖసంతోషాలతో సిరిసంపదలతో మెలిగారు.కనుక శ్రీరామచంద్రుని దేవునిగా భావించి అప్పటి నుంచి పెద్ద ఎత్తున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోంది.
చైత్ర శుద్ధ నవమి రోజు జన్మించిన శ్రీ రామ చంద్రుడికి నవమి రోజే కళ్యాణం కూడా జరిపిస్తారు.
ఈ మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు దేశవ్యాప్తంగా రామాలయాలలో పెద్దఎత్తున కల్యాణం జరిపిస్తారు.
అదేవిధంగా చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామచంద్రుడు జన్మించడమే కాకుండా ఇదే నవమి రోజు సీతా దేవిని వివాహమాడాడు, శ్రీరాముడు పితృ వాక్య పరిపాలకుడు తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన శ్రీరామచంద్రుడు తిరిగి అయోధ్యకు చేరుకొని చైత్ర శుద్ధ నవమి రోజు పట్టాభిషిక్తుడయ్యాడని చెబుతారు.కనుక చైత్ర శుద్ధ నవమి రోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం అప్పటినుంచి ఒక ఆచారంగా వస్తోంది.
శ్రీరాముని రాజ్యంలో ప్రజలందరూ సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం.ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు.
ఏడాది ఏప్రిల్ 21వ తేదీ నవమి వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.అయితే శ్రీరామచంద్రుడు జన్మించిన మధ్యాహ్న సమయంలో స్వామివారి కల్యాణం కార్యక్రమాన్ని జరిపిస్తారు.
అదేవిధంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పానకం వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తారు.కేవలం స్వామి వారు జన్మించినది మాత్రమే కాకుండా, వివాహమైనది కూడా నవమి రోజు.