మన దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేవాలయాలలో ప్రతిరోజు భక్తులు వెళ్లి పూజలు, అభిషేకాలు, హోమాలు చేస్తూ ఉంటారు.అంతే కాకుండా కొంత మంది భక్తులు దీపాలు వెలిగించి దీపారాధనలు కూడా చేస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే కొన్ని దేవాలయాలలో ప్రతి సంవత్సరం కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తుల సందడి తో ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మహోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సూర్యప్రభ వాహన సేవలో చిడతల రామాయణం, చిత్తూరు డ్రమ్స్ ఓలియాట్యం కళా ప్రదర్శనలు భక్తులందరినీ ఎంతగానో భక్తులందరినీ ఎంతగానో అలరించాయి.
హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమయ్య చార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్ట్, ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు అంగరంగ వైభవం గా జరిగేలా ఏర్పాటు చేశారు.

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ కు చెందిన కళాకారులు సీతారాములు, లక్ష్మణుడు, జనకుడు, కౌసల్య, ఆంజనేయ స్వామి, రావణుడు, వాలి, సుగ్రీవులు, విశ్వమిత్రులు తదితర వేషధారణలు ధరించి చిడతల తో రామాయణ గానం చేసి భక్తులను ఆకట్టుకున్నారు.చిత్తూరుకు చెందిన శ్రీరంగడు డ్రమ్స్ బృందం కళాకారుల డ్రమ్స్ వాయిద్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.
తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి చెందిన కళాకారులు తమిళనాడు గ్రామీణ ప్రాంతాలలోని సాంప్రదాయ ఒడియాట్యం నృత్యం ప్రదర్శించి అమ్మవారిని సంతోషపరిచారు.
అయితే హైదరాబాద్, విశాఖపట్నం, తూర్పుగోదావరి, తిరుపతి, బొబ్బిలికి చెందిన 14 భజన బృందాల కళాకారులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు కోలాటాలు కార్తీక మాస బ్రహ్మోత్సవానికి వచ్చిన భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.వీటన్నిటి మధ్య అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కనుల విందుగా ఎంతో వైభవంగా జరిగాయి.
ప్రతి సంవత్సరం ఇలాగే కార్తీకమాస బ్రహ్మోత్సవాలను భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి ఎంతో ఘనంగా, వైభవంగా బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తారు.