సాధారణంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేయడానికి చీపురు( Broom )నీ ఉపయోగిస్తారు.ఇది ఇంటిని శుభ్రంగా ఉంచి మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
అలాగే ఆఫీసు లేదా దుకాణం, రోడ్లు ఇలా అనేక ప్రాంతాలను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.హిందూ ధర్మం( Hindu Dharm )లో ఈ చీపురుకి అత్యంత ప్రాధాన్యత ఉంది చీపురుని లక్ష్మీదేవి( Lakshmi devi 0 రూపంగా చాలామంది ప్రజలు భావిస్తారు.
అయితే చీపురు ఉపయోగించిన తర్వాత ఎలా పడితే అలా పెట్టడం శాస్త్రానికి విరుద్ధం అని పెద్దవారు చెబుతూ ఉంటారు.అంతేకాకుండా ఉపయోగించిన తర్వాత కొన్ని నియమాలను పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

చీపురే కదా అంటూ ఆ నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటి పై ఆగ్రహం కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు.అయితే ఆర్థిక సంక్షోభంలో ఉన్న వారు ఇందుకు సంబంధించిన నివారణాలను పాటిస్తే ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు.నిజానికి చీపురును ఇంటిని శుభ్రపరిచే వస్తువుగా భావిస్తారు.వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు సహాయంతో ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూలతలను మరియు దురదృష్టాన్ని కూడా దూరం చేసుకోవచ్చు.
చీపురులోని శక్తి మీకు మీ కుటుంబానికి అదృష్టాన్ని తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే గురువారం( Thursday ) ఇంటికి కొత్త చీపురును కొనీ తీసుకొని రావాలి.ఈ రోజు చీపురు కొనడం మంచిది.అంతేకాకుండా చీపురు ఆర్థిక సంక్షోభాన్ని కూడా దూరం చేస్తుంది.అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ఒక చిన్న బంగారు చీపురును తీసుకొని దాన్ని పూజా మందిరంలో కొన్ని రోజులు ఉంచి పూజించాలి.ఆ తర్వాత ఆ బంగారు చీపురును ఇంట్లో భద్రంగా ఉంచుకోవాలి.
ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది.ఇంట్లో ఎవరైనా తరుచుగా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ ఇంటిని గురువారం చీపురుతో శుభ్రం చేసి తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి.
ఆ తర్వాత ఇంట్లో అన్ని గదుల్లో గంగాజలం చల్లడం మంచిది.ఇలా చేయడం వల్ల ఇంట్లోనీ వారి రోగాలు దూరం అవుతాయి.