ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండడంతో, ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి, జనసేన ( Ycp JanaSena Party )లు ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ, జనాల్లో తమ పార్టీ పై ఆదరణ పెరిగే విధంగా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ముఖ్యంగా ఆయా పార్టీల అధినేతలు, రాష్ట్ర స్థాయి నాయకులు పార్టీకి ఆదరణ పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లోనే ఉంటూ అధికార పార్టీపై విమర్శలతోవిరుచుకు పడుతున్నారు.కానీ జిల్లాస్థాయి నాయకత్వం లో మాత్రం ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు.
అంతర్గత విభేదాలు చుట్టుముడుతున్నాయి.రాష్ట్ర స్థాయి నాయకులు జనాల్లో తిరుగుతూ ,పార్టీకి ఆదరణ పెంచే ప్రయత్నం చేస్తున్నా, జిల్లా , నియోజకవర్గ స్థాయి నాయకులు మాత్రం ఆ దిశగా అడుగులు వేయకపోవడం టిడిపిలో ఆందోళన కలిగిస్తుంది.
పార్టీలో జిల్లాల స్థాయిలో నాయకులను నడిపించే నాయకత్వం బలహీనంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది .

.అనేక జిల్లాల్లో పార్టీ నాయకులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తుండడం టిడిపికి ఇబ్బందికరంగా మారింది. నియోజకవర్గంలో నాయకుల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించి , నాయకులు మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చే బాధ్యత జిల్లా నాయకత్వం తీసుకోవాల్సి ఉన్నా , ఆ దిశగా ప్రయత్నించకపోవడం వంటివి పార్టీకి ఇబ్బంది కరంగా మారాయి.
ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ సొంతంగా పరపతి పెంచుకునే ప్రయత్నం చేస్తుండడం వంటివి టిడిపికి ఇబ్బందికరంగా మారాయి. గతంలో అనేకమంది సీనియర్ నాయకులు బాధ్యతలు తీసుకుని తమ జిల్లాల్లో పార్టీ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకునేవారు.
కానీ ఇప్పుడు ఉన్న జిల్లాల్లోని నాయకత్వం ఈ దిశగా ప్రయత్నాలు చేయడం లేదట.

కొద్దిరోజుల కిందట నంద్యాల జిల్లాలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో మాజీ మంత్రి అఖిలప్రియ,( Bhuma Akhila Priya ) రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు.ఈ సందర్భంగా పోలీసులు అఖిల ప్రియను అరెస్టు చేసి జైలుకు పంపారు.ఇంత గొడవ జరిగినా, జిల్లా నాయకులు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయలేదట .ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇదే రకమైన పరిస్థితి ఉందట.ఈ రెండు జిల్లాలకు వేరు వేరు కమిటీలు ఉన్నా, ఆ కమిటీ సమావేశాలు జరిగి ఏడాది దాటిందట.
ఈ ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న, దీనిపై అధికార పార్టీని నిలదీసి పోరాటం చేయాల్సి ఉన్న, ఈ జిల్లాల నాయకులు అంతగా స్పందించడం లేదట .మంగళగిరిలో టిడిపి కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగినా, ఈ జిల్లాల నుంచి పార్టీ నేతలు అంతంతమాత్రంగానే స్పందించారట.గన్నవరం నియోజకవర్గంలోనూ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగిన తరువాత అక్రమ కేసులు నమోదైనా, జిల్లా నాయకులు కనీసం వారికి అండగా నిలిచే ప్రయత్నం చేయలేదట.ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ , జిల్లా స్థాయి నాయకులు అంతగా యాక్టివ్ గా లేకపోవడంతో నియోజకవర్గాల్లో పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందట.
టిడిపి అదినేత చంద్రబాబు నిత్యం ఏదో ఒక అంశంపై పోరాటం చేస్తూ, జనాల్లో ఉంటూ పార్టీకి పరపతి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.అలాగే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )యువగళం పాదయాత్ర ద్వారా పార్టీ నాయకుల్లో జోష్ పెంచుతూ, పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉండగా, జిల్లా నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం ఆ విధంగా లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.