మన దేశం వ్యాప్తంగా ఈ నెలలో కార్తీక మాసాన్ని దాదాపు ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకుంటున్నారు.కార్తీక మాసంలో ఎక్కువగా ఆడవారు కఠినమైన ఉపవాస దీక్షలను పాటిస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని పూజలు కూడా చేస్తూ ఉంటారు.ఈ కార్తీకమాసంలో దేవాలయాలకు వెళ్లి దీపాలు వెలిగించి నీటిలో వదులుతూ, దేవాలయాలను అలంకరిస్తూ ఉంటారు.
కార్తీక మాసంలో పూజ చేయాలంటే నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.నెయ్య, నూనె, ఆవనూనె లేదా జాస్మిన్ నూనెలతో దీపం వెలిగించడం ఎంతో మంచిది.
భగవంతునికి కుడివైపున నెయ్యితో వెలిగించిన దీపం ఎడమవైపు ఆవా నూనెతో వెలిగించిన దీపాన్ని ఉంచడం ఎంతో మంచిది.ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా మనసులోని మంచి మంచి కోరికలు నెరవేరుతాయి.
నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో నీ కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
శివ పురాణం ప్రకారం ప్రతిరోజు భగవంతుని దగ్గర నెయ్యి దీపం వెలిగించడం వల్ల నా ఇంట్లో సుఖసంతోషాలతో సంతోషంగా ఉంటారు.

నెయ్యితో వెలిగించిన దీపం గాలిని కూడా శుద్ధి చేస్తుంది.గాలిలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.నెయ్యి సువాసన వల్ల ఆ ఇంట్లోనే కుటుంబ సభ్యులందరూ మానసిక ప్రశాంతతను పొందుతారు.కుటుంబ సభ్యులలోని నిరాశ తొలగిపోతుంది.ఇంకా చెప్పాలంటే నెయ్యికి విద్యుత్ అయస్కాంత శక్తి నీ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.దీనివల్ల ఆ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి.
నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లోనే కుటుంబ సభ్యుల బాధలను నాశనం దూరం చేస్తుంది.కాబట్టి నెయ్యి దీపం అత్యంత శ్రేయస్కరమైనది.