నాగ చైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఫిదా సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల తరువాత చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే లవ్ స్టోరీ క్లైమాక్స్ లో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ ఉండనుందని ట్రాజెడీ క్లైమాక్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.సాధారణంగా తెలుగు ప్రేక్షకులు సినిమాకు హ్యాపీ ఎండింగ్ ఉండాలని భావిస్తారు.
కానీ ఈ మధ్య కాలంలో కథ డిమాండ్ చేస్తే ట్రాజెడీ క్లైమాక్స్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.ఇండస్ట్రీ వర్గాల్లో లవ్ స్టోరీ ట్రాజెడీ క్లైమాక్స్ తో తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతుండగా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఫిదా సినిమా తరువాత శేఖర్ కమ్ముల సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నాగ చైతన్య మార్కెట్ ను మరింత పెంచుతుందని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రస్తుతం చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమాలో నటిస్తుండగా సాయిపల్లవి వరుస సినిమా కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు.
వచ్చే ఏడాది సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన మూడు లేదా నాలుగు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాలుగేళ్ల గ్యాప్ తరువాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.ట్రాజెడీ క్లైమాక్స్ తో నాగచైతన్య రిస్క్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.