సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.మహేష్ బాబు ఒక యాడ్ లో నటిస్తే కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు.
మహేష్ బాబుకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటంతో అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రముఖ సంస్థలు సైతం నో చెప్పవనే సంగతి తెలిసిందే.అయితే మహేష్ బాబుకు ప్రముఖ పైరసీ సైట్లలో ఒకటైన ఐ బొమ్మ షాకిచ్చింది.
మహేష్ బాబు ఫోటోను వాడుకుంటూ ఐ బొమ్మ ఫ్రీగా సినిమాలను చూడొచ్చంటూ ప్రమోట్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.మహేష్ బాబు ఫోటోను ఐ బొమ్మ సైట్ వాడేసుకోవడంతో పాటు నిజంగా మహేష్ బాబు ఈ సైట్ ను ప్రమోట్ చేస్తున్నారనే విధంగా యాడ్ ఉండటం గమనార్హం.
ఐ బొమ్మ సైట్ లో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.ఈ మధ్య కాలంలో ఈ సైట్ నిర్వాహకులు ఐ బొమ్మ సైట్ ను క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించి వార్తల్లో నిలిచారు.అయితే ఆ తర్వాత ఆ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గారు.పైరసీ సైట్ లో మహేష్ బాబు సినిమాలు చూస్తున్న విధంగా పోస్టర్ ఉండటంతో ఈ పోస్టర్ విషయంలో మహేష్ బాబు అభిమానులు తెగ ఫీలవుతున్నారు.
ఈ సైట్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహేష్ బాబు అభిమానులు కోరుకుంటున్నారు.గతంలో ఏ పైరసీ వెబ్ సైట్ హీరోల ఫోటోలతో ఈ తరహాలో ప్రచారం చేసుకోలేదు.
ఈ విషయం మహేష్ బాబు దృష్టికి వస్తే మహేష్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.మహేష్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా ఐ బొమ్మ సైట్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు.
ఈ ఫేక్ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







