దాస్ కా ధమ్కి( Das Ka Dhamki ) సినిమా రోజురోజుకీ టాక్ మారుతూ ప్రస్తుతానికి పరవాలేదనిపిస్తోంది.మొదటి రెండు రోజులు టాక్ చూసేసరికి సినిమా ఫ్లాప్ అని అంతా భావించారు కానీ ఈ సమయంలో ఎలాంటి సినిమాలు రాకపోవడం, ఎన్టీఆర్ ( NTR )ఆడియో ఫంక్షన్ కి వచ్చి యూనిట్ ని బ్లెస్ చేయడం వంటి కార్యక్రమాల తర్వాత సినిమాకి మంచి పాజిటివ్ అప్లాజ్ వచ్చింది.
ఏదిఏమైనా ప్రస్తుతం సినిమా కలెక్షన్స్ పరంగా పరవాలేదు మొత్తానికి పెట్టే డబ్బుకు డోకా లేదు.విశ్వక్సేన్ ఈసారి బయట పడ్డట్టే కనిపిస్తోంది.
ఇక సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాలను కాసేపు పక్కన పెడితే ఈ చిత్రం ద్వారా విశ్వక్ సేన్( Vishwak Sen ) మరోసారి దేవి నాగవల్లి( Devi Nagavalli ) పై ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది.

ఛాన్స్ వచ్చిన ప్రతిసారి దేవి నాగవల్లి వర్సెస్ విశ్వక్ అనే వివాదం గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.అశోక వనంలో అర్జున కళ్యాణం ( Arjuna Kalyanam )సినిమాకి ముందు ప్రమోషన్స్ కాస్త బెడిసి కొట్టి విశ్వక్ సేన్ ని టీవీ9 రిపోర్టర్ దేవి నాగవల్లి విశ్వక్సేన్ ని గెటవుట్ ఫ్రం మై స్టూడియో అంటూ అవమానపరిచింది.ఈ విషయంలో సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు.
ఇక సినిమా తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయిన అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లో వీలైనంత విశ్వక్ తన అసహనాన్ని మీడియాపై ప్రవర్తిస్తూనే ఉన్నాడు.

ఇక ఇప్పుడు అసలు విషయం ఏమిటి అంటే ఇటీవల విడుదలైన దాస్ కా ధమ్కి సినిమాలో దేవి నాగవల్లిని ఉద్దేశించి ఒక కౌంటర్ డైలాగ్ పెట్టినట్టుగా కనిపిస్తుంది.కార్లో హీరోయిన్ ని తీసుకొని విశ్వక్ సేన్ మెడికల్ షాప్ దగ్గర ఆపమంటావా అంటూ ఒక అసహ్యకరమైన డైలాగుని ఉపయోగించగా, గెట్ అవుట్ ఫ్రం మై కార్ అంటూ హీరోయిన్ డైలాగ్ చెబుతుంది.ఇలా ఒక మెడికల్ షాప్ లో కాండోమ్ కొనడానికి దేవీ నాగవల్లి డైలాగ్ కి సెటైరికల్ గా వాడినట్టుగా కనిపిస్తోంది.
మరి ఇది కావాలని పెట్టాడా లేక యాదృచ్ఛికంగా సెట్ అయిపోయిందో తెలియదు కానీ చాలామంది ఇది దేనికి కౌంటర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.