మీ జుట్టు చాలా పల్చగా ఉందా.? హెయిర్ గ్రోత్ ( Hair growth )అస్సలు లేదా.? పల్చటి జుట్టుతో ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోలేకపోతున్నారా.? జుట్టును ఒత్తుగా పెంచుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.ఈ రెమెడీతో కొద్ది రోజుల్లోనే ఒత్తైన కురులను మీ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంతకీ ఆ హోమ్ రెమెడీ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేయండి.
ముందుగా ఒక ఉల్లిపాయను( Onion ) తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
అలాగే పెరటిలో ఉండే కలబంద ( Aloe vera )ఒకను కూడా తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, కలబంద ముక్కలు వేసి వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో ఒక ఎగ్ వైట్ ను( Egg white ) వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి క్లీన్ గా హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఉల్లిపాయ, కలబంద, గుడ్డు.ఈ మూడు అందరి ఇంట్లో దొరికేవే.అయితే ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.వారానికి ఒక్కసారి పైన చెప్పిన విధంగా చేస్తే వద్దన్నా కూడా మీ జుట్టు బీభత్సంగా పెరుగుతుంది.ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా సరే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.
అలాగే రెమెడీ వల్ల హెయిర్ ఫాల్ దూరమవుతుంది.జుట్టు సిల్కీగా సైతం మెరుస్తుంది.







