సాధారణ మనుషులకు లాగే ఇండస్ట్రీలో కూడా హీరోలకు స్నేహితులు ఉంటారు.కొందరు క్లాస్ మెంట్స్ ఉండి ఇప్పటికి స్నేహితులుగా రాణిస్తున్నారు.
కానీ వీరిద్దరి స్నేహం అందరికి భిన్నంగా ఉంటుంది.గొడవతో మొదలైన వీరిద్దరి స్నేహం ఒక్కరికి ఒక్కరిలా మారిపోయింది.
వారిద్దరే జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల.తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల మధ్య ఉన్నటువంటి స్నేహ బంధం గురించి అందరికి తెలిసిన సంగతే.
అయితే రాజీవ్ కనకాల దాదాపుగా జూనియర్ ఎన్టీఆర్ నటించినటు వంటి ప్రతీ సినిమాలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తూనే ఉన్నారు.
ఇక తాజాగా వీరిద్దరి గురించి ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తుంది.
కాగా.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.
గతంలో జూనియర్ ఎన్టీఆర్ తాను నటించినటు వంటి ఓ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించినటు వంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇక అదే ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజీవ్ కనకాల కూడా పాల్గొన్నారు.
అయితే ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ రాజీవ్ కనకాల గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులకు తెలియజేశారు.
అంతేకాదు.రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ ని కిడ్ (చిన్న పిల్లవాడు) అని తన ఫోన్లో ఫీడ్ చేసుకున్నాడని, అంతేగాక ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ దినోత్సవం రోజున శుభాకాంక్షలు కూడా తెలుపుతూ సందేశాలు పంపిస్తూ ఉంటాడని తెలియజేశారు.ఇక ఈ సందేశాలు ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పంపిస్తున్నాడని, తనకి ఇప్పుడు పిల్లలు ఉన్నారని, కానీ రాజీవ్ కనకాల మాత్రం తనని ఇంకా చిన్న పిల్లాడే అనుకుంటున్నాడని సరదాగా చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.
అయితే ప్రస్తుతం ఎన్టీఆర్, రాజీవ్ కనకాల సంబంధించినటు వంటి ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి టిక్ టాక్ లో బాగానే వైరల్ గా మారింది.