1.దళిత దండోరా కు పోలీసులు అనుమతి నిరాకరణ
ఈనెల 18న ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతం లో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన దళిత దండోరా సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.వేరే ప్రాంతంలో ఆ సభను వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
2.కేసీఆర్ కుటుంబం పై రాజాసింగ్ కామెంట్స్
కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతోంది అని బిజేపి శాసనసభా పక్ష నేత రాజాసింగ్ విమర్శించారు.
3.డిగ్రీ ప్రవేశాల గడువు 16 వరకు
తెలంగాణలో డిగ్రీ కాలేజీలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్ ) లో దరఖాస్తు చేసుకుని సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు గడువును 16 వరకు పొడిగించారు.
4.హజారుద్దిన్ దేశ ద్రోహి
హైదరాబాద్ క్రికెట్ అధ్యక్షుడు అజారుద్దీన్ పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ గురువారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.హజారుద్దీన్ దేశ ద్రోహి అంటూ అనేక సంచలన విమర్శలు చేశారు.
5.లక్ష దాటిన ఇంటర్ అడ్మిషన్ లు
ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలో ప్రథమ సంవత్సరం అడ్మిషన్ సంఖ్య లక్ష దాటిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
6.ఎంసెట్ ప్రిలిమినరీ కీ విడుదల
ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పిలిమినరీ కీ విడుదలైంది.ఈ కీ పై అభ్యంతరాలను eamset.tdche.ac.in ద్వారా శనివారం వరకు స్వీకరిస్తారు.
7.సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ రీ ఓపెన్
తెలంగాణలో పాఠశాలల ఓపెన్ సినిమా తెలంగాణ విద్యాశాఖ అధికారులు తీసుకున్న సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష బోధనను నిర్వహించాలని నిర్ణయించారు.
8.ఓటుకు నోటు కేసు
ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో నేడు ఓటుకు నోటు కేసు పై విచారణ జరిగింది.
9.గ్రేటర్ లో కాల్ చేస్తే టీకా సమాచారం
కాల్ చేస్తే సమీపంలోని మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల వివరాలను జిహెచ్ఎంసి సిబ్బంది తెలియజేయనున్నారు.దీనికోసం ప్రత్యేకంగా 040- 21111 టోల్ ఫ్రీ నెంబర్ ను జిహెచ్ఎంసి ఏర్పాటు చేసింది.
10.ద్వారకా తిరుమల ఈవో ను సస్పెండ్ చేయాలి
ద్వారకా తిరుమల జేఈవో సుబ్బారెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని జనసేన నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు.
11.పాఠశాలలు ప్రారంభించ వద్దు
కరుణ థర్డ్ దృష్ట్యా రాష్ట్రంలో పాఠశాలలను పునః ప్రారంభించాలనే నిర్ణయం ను ప్రభుత్వం వాయిదా వేసుకోవాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం కుమార్ డిమాండ్ చేశారు.
12.119 బీసీ గురుకులాలు ఇంటర్ కు అప్ గ్రేడ్
ఈ విద్యా సంవత్సరం నుంచి 119 బీసీ గురుకుల పాఠశాలలను ఇంటర్ కు అప్ గ్రేడ్ చేశారు.
13.శ్రీ వారి సేవలో సింధు
బ్యాట్మెంటన్ క్రీడాకారిణి పీవీ సింధు నేడు తిరుమల శ్రీ వారిని దర్శించుకున్నారు.
14.వైజాగ్ లో త్వరలోనే అకాడమీ : పీవీ సింధు
ధరణి విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభిస్తామని బ్యాట్మెంటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు.
15.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 40,120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.డెల్టా వైరస్ తో మహిళ మృతి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా ఓ 63 ఏళ్ల మహిళ మృతి చెందారు.ఆమెకు రెండు వాక్సిన్ లు పూర్తి అయినప్పటికీ ఈ వైరస్ బారిన పడ్డారు.
17.సీబీఐ కోర్టు కు రేవంత్
ఓటుకు నోటు కేసులో తెలంగాణ పిసిసి రేవంత్ రెడ్డి శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు.
18.10 వేల కోట్లతో స్క్రాపింగ్ పాలసీ
స్క్రాపేజి లో పది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
19.మహారాష్ట్రలో 65 డెల్టా కేసులు
మహారాష్ట్రలో కో డెల్టా వైరస్ కేసులు తీవ్రతరం అవుతున్నాయి.ఇప్పటి వరకు ఇక్కడ 65 కేసులు నమోదు కాగా , ఒకరు మృతి చెందారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,550 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,550