ఏజ్ పెరిగే కొద్ది ముఖంపై ముడతలు పడటం సర్వసాధారణం.కానీ కొందరు నలభై, యాభై ఏళ్ల వయసులో కూడా చాలా యంగ్ గా కనిపిస్తూ అందరిని ఎట్రాక్ట్ చేస్తుంటారు.
అటువంటి చర్మాన్ని మీరు పొందాలని అనుకుంటున్నారా.? ఏజ్ పెరిగిన ముడతలు దరిచేరకుండా ఉండాలని భావిస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాను తప్పకుండా ఫాలో అవ్వండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ చియా సీడ్స్(Chia seeds), వన్ టీ స్పూన్ అవిసె గింజలు (Flax seeds)మరియు అర కప్పు పచ్చి పాలు(raw milk) పోసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న అవిసె గింజలు, చియా సీడ్స్ ను వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి(Multani clay), వన్ టేబుల్ స్పూన్ తేనె(honey), వన్ టేబుల్ స్పూన్ పెరుగు (curd)వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ఇంటి చిట్కాను కనుక పాటిస్తే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా ఈ సింపుల్ ఇంటి చిట్కా స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది.
ముడతలు, చారలు (Wrinkles, lines)వంటివి దరిచేరకుండా అడ్డుకట్ట వేస్తుంది.చర్మాన్ని టైట్ గా ఉంచుతుంది.
మృదువుగా మరియు కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి వయసు పైబడిన కూడా యవ్వనంగా కనిపించాలని భావించేవారు కచ్చితంగా ఈ చిట్కాను ప్రయత్నించండి.
పైగా ఈ ఇంటి చిట్కాను పాటించడం వల్ల డ్రై స్కిన్ కు సైతం దూరంగా ఉండవచ్చు.







