సాధారణంగా చదువులో టాప్ లో ఉండే వాళ్లు సులువుగా జాబ్ సాధించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది.అయితే ప్రైవేట్ ఉద్యోగాలకు(private jobs) సైతం విపరీతమైన పోటీ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత కాలంలో ప్రైవేట్ జాబ్ సాధించడం కూడా సులువైన విషయం కాదు.
చిత్రాంశి ఆనంద్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని వారణాసి జిల్లాకు చెందిన వ్యక్తి.బెంగళూరులోని(Bangalore) ప్రముఖ సంస్థలో ఆనంద్ రెండేళ్ల పాటు పని చేశాడు.
ఏడాదికి 40 లక్షల రూపాయల ప్యాకేజీతో రెండేళ్లు పని చేసిన ఆనంద్ శాలరీ(Anand Salary), అనుభవం కొరకు మరో కంపెనీలో జాబ్ లో జాయిన్ కావడానికి సిద్ధమయ్యాడు.ఈ ఉద్యోగం కోసం అతను గట్టి ప్రయత్నాలే చేయడం గమనార్హం.
చివరకు ఉబర్ సంస్థలో తన క్వాలిఫికేషన్ కు తగిన జాబ్ ఉందని గుర్తించిన అతను ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.ఇంటర్వ్యూల కోసం ఏడు నెలల పాటు రీసెర్చ్ చేసి చివరకు ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.

ఇంటర్వ్యూ కోసం అతను లీట్ కోడ్ ఫ్లాట్(leet code) ఫాంను ఎంపిక చేసుకోగా ఏడు నెలల తర్వాత ఉబెర్ (Uber)ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూను క్రాక్ చేసిన అతనికి 60 లక్షల రూపాయల ప్యాకేజీ లభించింది.ఉబర్ లో వారానికి రెండు రోజులు మాత్రమే ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని అతను పేర్కొన్నారు.ఎక్కువ గంటలు పని చేయాల్సి వచ్చినా పని చేయడానికి తాను సిద్ధమేనని చిత్రాంశి ఆనంద్ (chitransh anand)పేర్కొన్నారు.

నా కెరీర్ తొలినాళ్లలోనే ఉంది కాబట్టి ఆఫీస్ పర్సనల్ లైఫ్ విషయాలలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని ఆయన అన్నారు.నేను అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కష్టపడి పని చేయాలని ఆ తర్వాత మాత్రమే లైఫ్ బ్యాలెన్స్ పై దృష్టి పెడతానని చెప్పుకొచ్చారు.







