కంటి చూపును షార్ప్ గా మార్చే ఈ ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ ను తింటున్నారా?

కంటి ఆరోగ్యం( Eye health ) పట్ల శ్రద్ధ వహించే వారి సంఖ్య బాగా తగ్గిపోతోంది.మన శరీరంలో అత్యంత సున్నితమైన ఇంద్రియం కళ్ళు.

 These Five Types Of Dry Fruits Make The Eyesight Sharp! Dry Fruits, Sharp Eyesig-TeluguStop.com

అటువంటి కళ్ళ విషయంలో అజాగ్రత్తగా ఉండేవారే ఎక్కువగా ఉంటారు.ఇందుకు తగ్గట్లుగానే ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా కంటి చూపు మందగించడం అనేది స్కూలుకు వెళ్లే పిల్లల్లో సైతం తలెత్తుతోంది.వయసు పైబడే సమయానికి కంటి చూపు పూర్తిగా తగ్గిపోతుంది.

అందుకే కంటి చూపును షార్ప్ గా మార్చే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ ( Dry fruits )అద్భుతంగా సహాయపడతాయి.

ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది బాదం పప్పు( Almonds ).కంటి ఆరోగ్యం కోసం రోజుకు ఐదు నానబెట్టిన బాదం పప్పులు తినేందుకు ప్రయత్నించాలి.బాదం లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మరియు విటమిన్ ఈ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.ఇవి కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.కంటి చూపును పెంచుతాయి.అలాగే కంటి ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు ఒకటి.

పిస్తా పప్పు( pistachio nut ) ఖరీదు కాస్త‌ ఎక్కువే అయినప్పటికీ.నిత్యం వాటిని తీసుకుంటే కంటి చూపు షార్ప్ గా మారుతుంది.

Telugu Almonds, Brazil Nuts, Dry Apricots, Dry Fruits, Tips, Latest, Pista Pappu

వాల్ నట్స్ కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.వాల్ నట్స్( Wall nuts ) లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ వయసు సంబంధిత నష్టం నుండి కళ్ళను కాపాడతాయి.నేత్ర సంరక్షణకు సహాయపడే మరొక డ్రై ఫ్రూట్ ఎండిన ఆప్రికాట్లు( Dried apricots ).వీటిలో విటమిన్ ఎ రిచ్ గా ఉంటుంది.డ్రై ఆప్రికాట్స్ ను నిత్యం తీసుకుంటే మంచి దృష్టిని ప్రోత్సహిస్తాయి.అదే సమయంలో నైట్ బ్లైండ్ నెస్ వచ్చే రిస్క్ ను సైతం తగ్గిస్తాయి.

Telugu Almonds, Brazil Nuts, Dry Apricots, Dry Fruits, Tips, Latest, Pista Pappu

ఇక కంటి ఆరోగ్యం కోసం బ్రెజిల్ నట్స్ ను కూడా డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.బ్రెజిల్ నట్స్ లో ఉండే సెలీనియం మరియు ఇతర పోషకాలు కంటి ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.కంటి చూపును పెంచుతాయి.మరియు కంటి శుక్లం నుంచి సైతం రక్షిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube