ఈ సూప్‌ను వారంలో 2 సార్లు తీసుకుంటే బ‌రువు సుల‌భంగా త‌గ్గుతారు!

ఇటీవ‌ల రోజుల్లో చాలా మందికి అధిక బ‌రువు అనేది పెద్ద స‌మ‌స్యగా మారింది.ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, హార్మోన్ ఛేంజ‌స్‌, ఒత్తిడి, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, ప్రెగ్నెన్సీ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల శ‌రీర బరువు అదుపు త‌ప్పుతుంటుంది.

 Spinach Soup Helps In Weight Loss ,  Spinach Soup , Benefits Of Spinach Soup , W-TeluguStop.com

పెరిగితే పెరిగాములే అని శ‌రీర బ‌రువును నిర్ల‌క్ష్యం చేశామా.ఇక అంతే సంగ‌తులు.

ఎందుకంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు అధిక బ‌రువు మూల‌మ‌వుతుంటుంది.అందుకే వెయిట్ లాస్ అయ్యేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అయితే అందుకు పాల‌కూర సూప్ అద్భుతంగా స‌హాయ‌పడుతుంది.అవును, పాల‌కూర సూప్‌ను వారంలో రెండంటే రెండు సార్లు తీసుకుంటే గ‌నుక చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గొచ్చు.పైగా పాల‌కూర సూప్‌ను త‌యారు చేసుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మైన ప‌ని కూడా కాదు.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో త‌రిగిన పాల‌కూర రెండు క‌ప్పులు, బంగాళ‌దుంప ముక్క‌లు అర క‌ప్పు, క్యారెట్ ముక్క‌లు అర కప్పు వేసి ఉడికించాలి.నీరంతా పోయాక స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార బెట్టుకుని.

మిక్సీలో మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్‌పై గిన్నె పెట్టి కాస్త నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.ఇప్పుడు అందులో పాల‌కూర బంగాళ‌దుంప క్యారెట్ పేస్ట్, అర కప్పు వాట‌ర్‌, అర స్పూన్ మిరియాల పొడి, రుచికి స‌రిప‌డా సాల్ట్‌ వేసి బాగా క‌లిపి ప‌ది నిమిషాల పాటు ఉడికిస్తే పాల‌కూర సూప్ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ పాలకూర సూప్‌ను వారంలో రెండు సార్లు తీసుకుంటే.

శ‌రీరంలో ఉన్న కొవ్వంతా క‌రిగిపోతుంది.అతి ఆక‌లి స‌మ‌స్య త‌గ్గుతుంది.

ఫ‌లితంగా వెయిట్ లాస్ అవుతారు.కాబ‌ట్టి, బ‌రువు త‌గ్గ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న వారు ఖ‌చ్చితంగా ఈ సూప్‌ను ట్రై చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube