చేపలను వండుకొని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు అని చాలా మందికి తెలుసు.అలాగే వారానికి ఒక్కసారి క్రమం తప్పకుండా చేపలు( Fish ) తింటే శరీరానికి ఎంతో మంచిది.
ఎందుకంటే చేపలలో మొత్తం ఆరోగ్యానికి మంచి చెయ్యడానికి అవసరమైన పోషకాలు ఉంటాయి.ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్( Omega three fatty acid ) కూడా ఉంటుంది.
ఇది చేపలలో సమృద్ధిగా ఉంటుంది.చెప్ప ముళ్లు వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు చేప కళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.చేప కళ్ల ( Fish eyes )గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది చేప తినేటప్పుడు దాని పై భాగం మాత్రమే తింటారు.దీనిలో ముళ్లు తలా భాగాన్ని తినకుండా ఉంటారు.ఎందుకంటే వారికి అందులో ఉండే పోషకాల గురించి అసలు తెలియదు.కానీ చేపలోని ప్రతి భాగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.చేప కళ్లు తలలో బోలెడు పోషకాలు ఉంటాయి.కాబట్టి చేపల లోని ఏ భాగాన్ని కూడా తినకుండా ఉండకూడదు.
అయితే ఇప్పుడు చేప కళ్లు తింటే ఎటువంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం.కంటి సమస్య ఉన్న వారికి చేప కళ్లు ఎంతో మేలు చేస్తాయి.

మీ కంటి చూపులో ఏదైనా సమస్య ఉంటే చేప కళ్లు ప్రయోజనకరంగా ఉంటాయి.ఎందుకంటే చేప కళ్లలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి చూపు ను మెరుగుపరుస్తాయి.చేప కళ్లు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.గుండె ఆరోగ్యానికి ఇవి మంచి మెడిసిన్ లా పని చేస్తాయి.తరుచూ చేప వాటి కళ్ల ను తినేవారికి గుండెపోటు, పక్షవాతం (Heart attack, stroke )ఇతర సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.చేపలు రోజు తినే వారిలో మెదడు సంబంధిత సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి.
ఎక్కువ జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు.అలాగే శరీరం కూడా చురుకుగా ఉంటుంది.
అలాగే చేప కళ్లు తింటే మెదడు పని తీరు మెరుగుపడుతుంది.బీపీ కూడా అదుపులో ఉంటుంది.
చేప కళ్లు తింటే డయాబెటిస్ బారిన పడకుండా ఉంటారు.ఇలా తింటే షుగర్ ఉన్న కూడా అదుపులో ఉంటుంది.
చేపలోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.