టాలీవుడ్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు( Mohan Babu ) తాజాగా తన 72వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షికోత్సవంలో పాల్గొన్న మంచు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సినిమాలు తీసి కొంత డబ్బులు పోగొట్టుకున్నాను.
మలయాళంలో ఒక ఛాన్స్ ఇప్పించండని మోహన్ లాల్( Mohanlal 0ను అడుగుతున్నాను.అది కూడా విలన్ పాత్ర మాత్రమే కావాలి.
శరీరం శాశ్వతం కాదు శరీరంపై వ్యామోహం ఉండ కూడదు.ఎవరికైనా మనం దానం చేస్తే ప్రతిఫలంగా ఏమీ ఆశించకూడదు.
సినిమాల్లో ఎంతో కాలం ఉండలేము.

ప్రతి దానికి రిటైర్మెంట్ ఉంటుంది.అందుకోసమే కల్మషం లేని పిల్లలతో గడుపుతాను అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు.ఒక ఇడ్లీ తింటే చాలు అనుకున్న పాత రోజులు ఇంకా నాకు గుర్తు ఉన్నాయి.
ప్రముఖ గాయకుడు గద్దర్( Singer Gaddar ) నా తమ్ముడు, గద్దర్ కుమార్తె ఇక్కడే చదివింది.మోహన్ బాబు మాకు అన్నం పెట్టి చదివించారని గద్దర్ కూతురు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
చదువు కంటే క్యారక్టర్ ముఖ్యం.శ్రీ విద్యానికేతన్( Sree Vidyanikethan ) నుంచి ఎందరో IPS, IAS గా ఎన్నో డిపార్ట్మెంట్‌లలో ఉద్యోగాలు సంపాదించారు.
మనోజ్ చెప్పినట్లు ఓటు కోసం అందరూ ఎర వేస్తారు.రాష్ట్ర రాజకీయాలు మాట్లాడను.
వచ్చే ఎన్నికల్లో దేశంలో మళ్ళీ ప్రధానిగా మోదీ రావాలి.ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నో సందర్భాల్లో కలిశాను.

అలాంటి ఆలోచనలు, విధానాలు కలిగిన వ్యక్తి భారతదేశానికి అవసరం.ఎన్నికల్లో( Elections ) ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి.ఇరు పక్షాల వారూ డబ్బులు ఇస్తారు.ఆ డబ్బు మనదే.లంచాలు తీసుకొన్న మన డబ్బే తిరిగి ఓట్ల కోసం మనకు ఇస్తారు.కాబట్టి ఆ డబ్బు తీసుకోండి.
ఓటు మాత్రం నచ్చిన వారికి వేసి, భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్లడానికి సహకరించండి కాబట్టి ఆలోచించి ఓటు వేయండి.అని నటుడు మోహన్ బాబు అన్నారు.
కాగా మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షికోత్సవ వేడుకలకు( MBU annual day ) ముఖ్య అతిథులుగా ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్, ఆర్టిస్ట్ ముఖేష్ రిషి వంటి చాలామంది సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు.