సినిమాల్లో ఏదైనా పాత్ర లో పాలనా నటుడు నటిస్తే అతడి సొంత పేరు మర్చిపోయి సదరు పాత్ర పేరుతో సాధారణ ప్రేక్షకుడు పిలిస్తే నిజం గా ఆ నటుడు తన పాత్రకు న్యాయం చేసినట్టే.ఆలా చాల మంది నటులు తమ సొంత పేర్ల కన్నా కూడా సినిమా పేర్లతో పాపులర్ అయినా వాళ్ళు ఉన్నారు.
ఇక కొంత మంది విలన్స్ అయితే ఎక్కడ నిజంగానే హీరో ను చంపేస్తాడేమో అని అనిపించేంత రియల్ గా నటిస్తూ పాత్రలకు ప్రాణం పోస్తున్నారు.ఆలా చెప్పుకోదగ్గ నటులలో గుర్తు పెట్టుకోవాల్సిన నటుడు వల్లభనేని జనార్ధన్.
వందల సినిమాల్లో నటించిన రాని గుర్తింపు కొన్ని సార్లు తక్కువ సినిమాలకే వస్తుంది.ఆలా ఎప్పటికి ప్రేక్షకుల మనసులో గుర్తుండి పోయే నటుడిగా ఈయన పేరు చెప్పుకోవచ్చు.
ముఖ్యం దుష్ట పోలీస్ పాత్రలకు ఈయన పెట్టింది పేరు.గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి స్నేహితులను చిత్ర హింసలు పెడుతుంటే అప్పట్లో చాల మంది అది నిజం అనుకోని ఆయన్ను కొట్టాలని అనుకున్నారట.
అంతలా ప్రభావం చూపారు అయన నటనతో, ఇక ఈయన దర్శకుడు విజయ బాపినీడు మరియు చిరంజీవి కాంబినేషన్ లో ఎక్కువగా నటించారు.
అందుకు వల్లభనేని జనార్ధన్ నటన ఒక కారణం అయితే విజయ బాపినీడు చిన్న కూతురిని వల్లభనేని జనార్ధన్ పెళ్లి చేసుకోవడం మరొక కారణం.ఆలా అని జనార్దన్ ఎదో మామ పేరు చెప్పుకొని సినిమా ఇండస్ట్రీ లో వేషాలు సంపాదించుకోవాలని అనుకోలేదు.అయన తన సొంత టాలెంట్ తోనే అప్పట్లో నటించారు.
ఇక వాలుజెడ తోలు బెల్టు సినిమాలో మాత్రం రాజేంద్ర ప్రసాద్ కి నరకం చూపించినప్పుడు అయ్యో అనుకోని ప్రేక్షకులు లేరంటే నమ్మండి.సొంత అల్లుడు అయినా కూడా ఈ సినిమాలో జనార్దన్ కి పాత్ర వూరికే ఇవ్వలేదు విజయ బాపినీడు.
అంత కన్నా ముందే చాల మందిని అనుకోని ఆ తర్వాత వేరే నటుడు అయితే న్యాయం చేయడము అందరు చెప్పడం తో వల్లభనేని జనార్ధన్ కి ఆ పాత్ర ఇచ్చారట.ఇలా చెప్పుకుంటే వల్లభనేని జనార్ధన్ గురించి ఒక ఆర్టికల్ సరిపోదు.
మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తో మళ్లి కలుద్దాం.