మిస్టరీగా మారినా ఇందిరా గాంధీ కాలపాత్ర..ఇప్పుడు ఎక్కడ ఉందొ తెలుసా ?

మీలో ఎంత మందికి టైం క్యాప్సూల్ అనే పదం పై అవగాహన ఉంది లేదా ఆ విషయం పై స్పష్టత ఉంది మీకు తెలియకపోతే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే.టైం క్యాప్సిల్ తెలుగులో కాల నాళిక అంటే ఆ కాలపు విశేషాలు లేదా ప్రస్తుత కాలంలో ఉన్న విశేషాలు, చరిత్ర, నిజాలు అన్నీ కూడా ఒకచోట భద్రపరిచి భవిష్యత్తు తరాలకు అందించాలని ఒకచోట పాతి పెట్టడమే ఈ టైం క్యాప్సిల్, ఆ మధ్యకాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమా విశేషాలు అన్నింటిని కూడా ఓ చోట భద్రపరిచారట.

 Mystery About Indira Gandhi Kalapathra , Indira Gandhi Kalapathra , , Indira Gan-TeluguStop.com

అలాగే అయోధ్యలో రామాలయం గుడి కట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ గుడికి సంబంధించిన పోరాటాలు, దాని వల్ల జరిగిన నష్టాలు, అలాగే విజయానికి సంబంధించిన అన్ని విశేషాలతో ఒక టైం క్యాప్సూల్ చేసి అక్కడ పాతిపెట్టారు.అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన ఇందిరా గాంధీ కూడా ఒకానొక టైంలో ప్రధాన మంత్రిగా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో ఒక టైం క్యాప్సిల్ ని పాతిపెట్టారు.

దాని పేరే కాల పాత్ర.ఆ కాలపాత్ర ఏమైంది ? అసలు ఉందా ? దాని గురించిన మిస్టరీ ఇప్పుడు తెలుసుకుందాం.

1973 వ సంవత్సరంలో ఇందిరాగాంధీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 25 ఏళ్ల పాటు జరిగిన విశేషాలు అలాగే విజయాల గురించి అప్పటి చరిత్ర గురించి ఒక టైం క్యాప్సూల్ సిద్ధం చేసుకోవాలని అనుకున్నారు.అనుకున్నదే తడవుగా ఆ బాధ్యతను ఇండియన్ హిస్టారికల్ రీసెర్చ్ సెంటర్ కి ఆ బాధ్యతలను అప్పగించారు.

ఇక ఇందిరా గాంధీ కాల పాత్ర పనిని మద్రాస్ క్రిస్టియన్ యూనివర్సిటీకి చెందిన కృష్ణ స్వామికి అప్పగించారు.ఆయన ఇందిర మనసును పూర్తిగా తెలిసిన వ్యక్తి కావడంతో ఒక రిపోర్ట్ ని సిద్ధం చేసి డాక్యుమెంటరీ రూపంలో సిద్ధం చేశారు.

ఇక ఆ డాక్యుమెంటరీ ని ప్రముఖ చరిత్రకారుడైన బద్రీనాథ్ కి పరిశీలించాలని పంపించగా దాన్ని పూర్తి తప్పులు తడకగా ఆయన కొట్టి పారేశారు.అంతేకాదు కేవలం తండ్రి కూతుళ్ళ విజయాలను మాత్రమే చూపిస్తే అది కాల పాత్ర ఎందుకు అవుతుంది? దాంట్లో అనేక విషయాలను విస్మరించారని ఆయన విమర్శించారు.

Telugu Indira Gandhi, Indiragandhi, Krishna Swami, Manushimagazine, Mysteryindir

ఇక ప్రతిపక్షాలు సైతం మీ గొప్పలు చెప్పుకోవడానికి ఒక టైం క్యాప్సూల్ ని తయారు చేయాల అంటూ విమర్శ చేయడం మొదలు పెట్టారు.ఇవన్నీ పట్టించుకుంటే ఆమె ఇందిరా ఎందుకు అవుతుంది.అన్నిటిని పక్కన పెట్టి ఇందిరా గాంధీ ఒకసారి అనుకున్నాక అది ఆగడు కాబట్టి అనుకున్నదే తడవుగా ఆ టైం క్యాప్సూల్ ని సిద్ధం చేసి భద్రపరచాలని డిసైడ్ అయిపోయింది.దానిపైన వెయ్యి సంవత్సరాల తర్వాతే అది ఓపెన్ చేయాలని స్పష్టంగా రాశారు.

అంటే 2073 వ సంవత్సరంలో దాన్ని తిరిగి ఓపెన్ చేయాలన్న మాట.కానీ ఆ తర్వాత జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇందిరా గాంధీ తప్పుల తడకను అంటే కాలపాత్రను నిర్వీర్యం చేయాలని అనుకుంది.ఇందిరాగాంధీ కేవలం ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టి కాలపాత్రను తయారు చేయించగా దాన్ని తీయడానికి ఏకంగా 58 వేల ఖర్చు పెట్టి ఓపెన్ చేశారు ఆ తర్వాత కలపాత్రను ఏం చేశారన్నదే ఒక పెద్ద మిస్టరీ.2012వ సంవత్సరంలో మానుషి పత్రిక ఎడిటర్ మధు కిశ్వర్ దానికి సంబంధించిన సమాచారం కోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గరికి వెళ్లి సమాచారం కోరగా వారి దగ్గర దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని స్పందన వచ్చింది.దాంతో ఇందిరాగాంధీ కాల పాత్ర ఏమైంది ? ఉందా లేక ధ్వంసం చేశారా ? లేదా మళ్లి పాతి పెట్టారా ? ఇలాంటి ప్రశ్నలు మొదలయ్యాయి.ఏది ఏమైనా ఈ కాలపాత్ర మిస్టరీగానే ఉండిపోయింది.

ఒకవేళ గనుక మోడీజీ కే గనక దీని గురించి గుర్తుండి ఉంటె ఇందిరా గాంధీ యొక్క కుటుంబాన్ని అబాసు పాలు చేయడానికి అయినా కాలపాత్ర తీసి ఉండేవారేమో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube