ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు ఎండలు ఎంతలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎండల తీవ్రతకు బయట కాలు పెట్టాలంటేనే ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారు.ఇక వేసవి వేడికి ప్రధానంగా వేధించే సమస్యల్లో నీరసం, తలనొప్పి ముందు వరుసలో ఉంటాయి.
ఎండల తీవ్రత కారణంగా ఒంట్లో శక్తి మొత్తం ఆవిరి అయిపోతుంటుంది.అలాగే అధిక వేడి కారణంగా తీవ్రమైన తలనొప్పి బాధిస్తుంటుంది.
అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే రిఫ్రెషింగ్ డ్రింక్ ను తీసుకుంటే తలనొప్పి, నీరసం సమస్యల నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రిఫ్రెషింగ్ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia Seeds ) వేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బాగా పండిన ఒక మామిడి పండు( Mango )ను వాటర్ తో కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు, ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులో రెండు లేదా మూడు లెమన్ స్లైసెస్, నాలుగు ఫ్రెష్ పుదీనా ఆకులు, వన్ టేబుల్ స్పూన్ పటిక బెల్లం పొడి వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.

ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న మామిడి పండు మిశ్రమాన్ని వేసి కొద్దిగా వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ వాటర్ మరియు నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసి బాగా మిక్స్ చేస్తే మన రిఫ్రెషింగ్ డ్రింక్ సిద్ధమైనట్లే.ఈ మెంట్ మ్యాంగో రిఫ్రెషింగ్ డ్రింక్ చాలా టేస్టీ గా ఉండడమే కాదు హెల్త్ కి ఎంతో మేలు చేస్తుంది.ప్రస్తుత వేసవికాలంలో రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను తీసుకుంటే తలనొప్పి దెబ్బకు పరారవుతుంది.
నీరసం అలసట దూరమై శరీరం క్షణాల్లో ఫుల్ ఎనర్జిటిక్ గా మారుతుంది.తక్షణ శక్తిని పొందడానికి ఈ డ్రింక్ ఉత్తమంగా సహాయపడుతుంది.ఒత్తిడి, డిప్రెషన్ వంటివి దూరమవుతాయి.మైండ్ తో పాటు బాడీ రిఫ్రెష్ అవుతుంది.
పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది.వడదెబ్బ బారిన పడకుండా సైతం ఉంటారు.