1.దేవగౌడ నివాసానికి కేసీఆర్
కర్ణాటకలోని మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లారు.
2.హైదరాబాదులో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ లాడ్ బజార్ లో అగ్నిప్రమాదం సంభవించింది.రెండంతస్తుల భవనం లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో బిల్డింగ్ లో ఉన్న దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
3.చేప ప్రసాదం పంపిణీ లేదు
ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ లేదని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానానికి ఎవరు రావద్దని బత్తిన హరినాథ్ గౌడ్ చెప్పారు.
4.డివైడర్ ఉన్న రోడ్డుపై గరిష్ట వేగం 60 కిలోమీటర్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేగాన్ని నియంత్రిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.దీని ప్రకారం డివైడర్ ఉన్న రహదారిపై 60 కిలోమీటర్లు మించకూడదని, డివైడర్లు లేని రోడ్లపై 50 కిలోమీటర్లు, కాలనీ రోడ్లపై 30 కిలోమీటర్ల వేగం దాటకూడదు అని నిబంధనల్లో పేర్కొంది.
5.6 లక్షల మందితో రెడ్డి సింహ గర్జన
తమ డిమాండ్ల సాధన కోసం రెడ్డి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వచ్చే నెల 29వ తేదీన నిర్వహించ తలపెట్టిన రెడ్డి సింహ గర్జన సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.దాదాపు ఆరు లక్షల మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.ఈ సభను ఘట్ కేసరి ప్రధాన రహదారి సమీపంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
6.పోలీస్ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు
తెలంగాణలో పోలీస్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో ముగియనున్న ట్లు తెలంగాణ పోలీస్ నియామక మండలి తెలిపింది.
7.మహానాడు ను అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం
మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం పై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
8.చలో అమలాపురానికి ఏపీ కాంగ్రెస్ పిలుపు
చలో అమలాపురం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.కాంగ్రెస్ ఆందోళన ను పోలీసులు అడ్డుకున్నారు.
9.పవన్ కళ్యాణ్ పై నాని విమర్శలు
నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ పబ్బం గడుపుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.
10.రుషికొండ తవ్వకాల పిటీషన్ పై విచారణ చేపట్టండి
రుషికొండ తవ్వకాలపై దాఖలు చేసిన పిటిషన్ పై వెంటనే విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
11.రెండో రోజు ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
కోనసీమలో వరుసగా రెండో రోజు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.అమలాపురం సహా అన్ని మండలాల్లో అన్ని టెలికాం కంపెనీలు నెట్ సర్వీసులు బంద్ అయ్యాయి.
12.ఎయిర్ పోర్ట్ లో హిందువులపై దాడులు పెరిగిపోయాయి
ఏపీలో హిందువులపై దాడులు పెరిగిపోయాయి అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
13.ఏపీ మంత్రుల బస్సు యాత్ర ప్రారంభం
సామాజిక న్యాయ బేరి మంత్రుల బస్సుయాత్ర గురువారం ఉదయం శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమైంది.అనంతపురం జిల్లా వరకు ఇది కొనసాగనుంది.
14.మోదీ కి వ్యతిరేకంగా హైదరాబాదులో ఫ్లెక్సీలు
తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోది కి అనేక సమస్యలను ప్రస్తావిస్తూ హైదరాబాద్ నగరంలో 17 చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
15.తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
16.టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం
నేడు ఒంగోలులో టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైంది.
17.నేడు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం
వచ్చే నల 6 7 తేదీల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్న నేపథ్యంలో నెల్లూరులో నేడు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
18.నేడు రేపు ఏపీలో కాంగ్రెస్ నిరసన దీక్షలు
నేడు రేపు ఏపీ వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద కాంగ్రెస్ నిరసన దీక్షలు చేపట్టనుంది.
19.జ్ఞాన్ వాపి వివాదంపై తీర్పు
నేడు జాన్ వాపీ వివాదంపై వారణాసి కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,650 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,980
.