ఒకప్పుడు ప్రజలందరూ పగలంతా పనులు చేసుకుని రాత్రి 7, 8 గంటలకల్లా పడుకునే వారు.మళ్లీ ఉదయాన్నే నిద్ర లేచి ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యేవారు.
కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది.పిల్లల నుంచి పెద్దల వరకు రాత్రుళ్ళు 10 కానిదే పడుకోవడం లేదు.
టీవీలు, మొబైల్స్ చూసుకుంటూ నిద్ర సమయాన్ని( Sleeping Time ) వృధా చేస్తున్నారు.కొందరైతే అర్ధరాత్రి అయినా మెలకువగానే ఉంటారు.
ఫోన్ లో సినిమాలు చూడటం, చాటింగ్, కాల్స్ మాట్లాడటం వంటివి చేస్తూ నిద్రను నిర్లక్ష్యం చేసే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది.
అయితే రోజు రాత్రుళ్ళు ఆలస్యంగా పడుకోవడం( Sleeping Late ) వల్ల ఎన్నో జబ్బులు తలెత్తుతాయి.
అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటే ఫుడ్ పై కంట్రోల్ పోతుంది.మిడ్ నైట్ క్రేవింగ్స్( Midnight Cravings ) అంటూ ఏది పడితే అది తినేస్తుంటారు.దీంతో శరీర బరువు అదుపు తప్పుతుంది.ఊబకాయం( Obesity ) బాధితులుగా మారతారు.
అలాగే రాత్రుళ్ళు ఆలస్యంగా నిద్రించడం వల్ల అల్జీమర్స్( Alzheimers ) వ్యాధి వచ్చే రిస్క్ పెరుగుతుంది.లేట్ గా పడుకోవడం వల్ల మెదడు పనితీరు నెమ్మదించడం స్టార్ట్ అవుతుంది.
జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి, ఏకాగ్రత తగ్గుతూ వస్తాయి.క్రమంగా అల్జీమర్స్ కు దారితీస్తుంది.

వేలకు పడుకోకుండా నిద్రను నిర్లక్ష్యం చేస్తే ఒత్తిడి పెరుగుతుంది.ఒత్తిడి పెరిగితే మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి రోగాలను స్వయంగా ఆహ్వానించినట్లు అవుతుంది.అంతేకాదు రోజు రాత్రుళ్ళు ఆలస్యంగా పడుకునే వారికి ఇమ్యూనిటీ సిస్టమ్( Immunity System ) దెబ్బతింటుంది.సీజనల్ వ్యాధులు తరచూ వేధిస్తుంటాయి.

అంతేనా నైట్ లేట్ గా నిద్రించడం వల్ల ముడతలు, చారలు వంటి వృద్ధాప్య ఛాయలు తక్కువ ఏజ్ లోనే వచ్చేస్తాయి.కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ కూడా ఏర్పడతాయి.ఆలస్యంగా పడుకోవడం వల్ల అటు ఆరోగ్యం ఇటు అందం రెండు దెబ్బతింటాయి.కాబట్టి వీలైనంత వరకు 9:30 నుంచి 10 గంటల కల్లా నిద్రించడానికి ప్రయత్నించండి.ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోండి.







