ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులు, ఫర్నిచర్ అమ్ముతారనే విషయం మీకు తెలిసే ఉంటుంది.కానీ ఒకటవ ప్రపంచ యుద్ధం నాటి ఓడ శిథిలాలను అమ్మకానికి పెట్టడం, దాన్ని ఒక వ్యక్తి కేవలం రూ.34,000కే కొనేయడం గురించి తెలిస్తే నమ్మలేరు.సరిగ్గా ఇలాంటి ఘటనే యూకేలో జరిగింది.
యూకేకి చెందిన డోమ్ రాబిన్సన్ అనే వ్యక్తికి ఈ అరుదైన అవకాశం తలుపు తట్టింది.ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో బ్రౌజ్ చేస్తుంటే, అతని కళ్లు ఆగిపోయాయి.
అక్కడ “మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఓడ శిథిలాలు అమ్మకానికి” అని ఉంది.ధర చూస్తే మరీ విస్మయం.
కేవలం 300 బ్రిటిష్ పౌండ్లు( 300 British pounds ).అంటే మన రూపాయల్లో సుమారు రూ.34,000 మాత్రమే.ఇంకేం ఆలోచించకుండా, క్షణం కూడా ఆలస్యం చేయకుండా దాన్ని కొనేశాడు డోమ్.
ఆ ఓడ పేరు SS అల్మండ్ బ్రాంచ్( SS Almond Branch ).అప్పట్లో అది చాలా పెద్ద కార్గో ఓడ.దాదాపు 3,300 టన్నుల బరువు, 330 అడుగుల పొడవు ఉండేదట.ఇది మామూలుగా మునిగిపోలేదు.
సరిగ్గా 1917 నవంబర్ 27న ఇంగ్లాండ్‌లోని కార్న్‌వాల్ తీరంలో ఉన్నప్పుడు, మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్ జలాంతర్గామి టార్పెడోతో దాడి చేసింది.అంతే, క్షణాల్లో ఆ భారీ ఓడ సముద్రంలోకి వెళ్లిపోయింది.
అప్పటి నుంచి అక్కడే, నీటి అడుగున విశ్రమిస్తోంది.డోమ్ రాబిన్సన్‌కు డైవింగ్ అంటే, సముద్ర గర్భంలో మునిగిపోయిన ఓడలను వెతకడం అంటే ప్రాణం.ఇలాంటి ఒక చారిత్రక ఓడ అమ్మకానికి ఉందని తెలియగానే ఉబ్బితబ్బిబ్బయ్యాడు.“నేను వెంటనే అక్కడికి వెళ్లి దాన్ని చూశాను.చూడగానే దాని విలువ ఏంటో నాకు అర్థమైంది.అది మామూలుది కాదని తెలుసుకున్నాను” అని అతను చెప్పాడు.ఆ ఓడ చారిత్రక విలువను వెంటనే గుర్తించాడు డోమ్.

రాబిన్సన్ ఇదంతా ఎలా చేస్తాడంటే చాలా ఏళ్లుగా సముద్ర గర్భంలో స్కానింగ్ టూల్స్‌తో వెతుకుతాడు.ఏవైనా అసాధారణ ఆకారాలు కనిపిస్తే, వెంటనే డైవింగ్ చేసి అక్కడికి వెళ్లి చూస్తాడు.ఇలా గత కొన్నేళ్లలో దాదాపు 20 నుంచి 25 మునిగిపోయిన ఓడలను అతను కనుగొన్నాడు.తన అన్వేషణ వీడియోలను యూట్యూబ్‌లో పెట్టి, ఇంకా చాలా మందికి ఈ విషయంపై ఆసక్తి కలిగించాలని అనుకుంటున్నాడు.”ప్రతి మునిగిపోయిన ఓడ వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది.అదే నాకు బాగా నచ్చే విషయం” అని రాబిన్సన్ అంటాడు.
ఇప్పుడు ఏకంగా ఒక ఓడనే సొంతం చేసుకోవడం వల్ల, ఈ అనుభూతి మరింత ప్రత్యేకం అంటున్నాడు.కానీ, ఈ కొనుగోలుతో ఇంట్లో అందరూ సంతోషంగా లేరు.ముఖ్యంగా 53 ఏళ్ల అతని భార్య సుజికి చాలా కోపం వచ్చిందట.“ఇదంతా డబ్బు వృధా” అని ఆమె మండిపడినట్లు రాబిన్సన్ నవ్వుతూ చెప్పాడు.అయితే, రాబిన్సన్ ఒక విషయంపై మాత్రం చాలా ఆశగా ఉన్నాడు.ఆ ఓడలో ఉండే అసలు గంట (Bell)ను కనిపెట్టాలని చూస్తున్నాడు.