సాధారణంగా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటే ఉన్నత చదువులు చదవడం సులువు కాదు.మహారాష్ట్ర( Maharashtra ) రాష్ట్రంలోని అమగె గ్రామానికి చెందిన బీరప్ప సిద్ధప్ప డోని ( Beerappa Siddappa Dhoni )అన్న సైన్యంలో చేరడంతో తాను కూడా సైన్యంలో చేరాలని కల కన్నాడు.
అయితే ఆ కలను నెరవేర్చుకోవడం సాధ్యం కాకపోవడంతో బీటెక్ పూర్తి చేసి చివరకు పోస్టల్ జాబ్ సాధించాడు.ఐపీఎస్ కావాలని పోస్టల్ జాబ్ వదిలి బీరప్ప లక్ష్యంపై దృష్టి పెట్టారు.
మూడో ప్రయత్నంలో బీరప్ప 551వ ర్యాంక్ సాధించడం గమనార్హం.బీరప్పకు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఘనంగా సన్మానం చేశారు.
తన కొడుకు లక్ష్యాన్ని సాధించడం గురించి బీరప్ప తండ్రి సిద్ధప్ప డోని మాట్లాడుతూ నా కొడుకు ఏం పరీక్షలు రాశాడో ఏం ఘనత సాధించాడో నాకు తెలియదని ఆయన తెలిపారు.అర్మీలో చేరాలని నా కొడుకు కల అని ఆయన చెప్పుకొచ్చారు.
నా కొడుకు తన లక్ష్యాన్ని సాధించలేక పోయేసరికి బాధ పడ్డాడని కానీ ఇప్పుడు నా కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని అంతా అంటుంటే గర్వంగా ఉందని ఆయన వెల్లడించారు.నా కొడుకు సంతోషంగా ఉన్నాడని అది చాలని సిద్ధప్ప డోని అన్నారు.
బీరప్ప ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.తన చదువుతో బీరప్ప పేదరికాన్ని సైతం జయించారు.

మట్టిలో నుంచి మెరిసిన మాణిక్యం బీరప్ప ప్రతిభను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.బీరప్ప భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకుని ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బీరప్ప భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.బీరప్ప డోని సక్సెస్ స్టోరీని చూసి తన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.