వెల్లుల్లి కరివేపాకు కలిపి తలకు రాశారంటే మీ జుట్టు రెండింతలు అవ్వడం గ్యారెంటీ!

మనలో చాలా మందికి జుట్టు( hair ) అనేది పల్చగా ఉంటుంది.కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని పనిచేయడం, ఒత్తిడి, రేడియేష‌న్‌, పోషకాల కొరత, కాలుష్యం, రసాయనాలతో కూడిన షాంపూలను వినియోగించడం తదితర కారణాల వల్ల జుట్టు అధికంగా రాలి పల్చగా మారుతుంటుంది.

 Applying Garlic And Curry Leaves On Your Head Will Double Your Hair! Garlic, Cur-TeluguStop.com

ఒత్తైన జుట్టు వారితో పోలిస్తే పల్చటి జుట్టు కలిగి ఉన్న వారు అంత అట్రాక్టివ్ గా కనిపించలేదు.అందుకే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు తెగ ఆరాటపడుతూ ఉంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే వంటింటి చిట్కా చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ చిట్కాను ఫాలో అయితే కొద్ది రోజుల్లోనే రెండింతలు జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.

మరి లేటెందుకు ఆ వంటింటి చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ( Garlic cloves )తీసుకుని కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె పోసుకోవాలి.

Telugu Garliccurry, Curry, Double, Care, Care Tips, Fall, Healthy, Latest, Thick

అలాగే అందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు మరియు ఒక కప్పు కరివేపాకు( curry leaves ) వేసుకుని చిన్న మంటపై దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని కాసేపు మసాజ్ చేసుకోవాలి.

Telugu Garliccurry, Curry, Double, Care, Care Tips, Fall, Healthy, Latest, Thick

నైట్ ఆయిల్ అప్లై చేసుకుని మరుసటి రోజు ఉదయం తేలిక పాటి షాంపూతో తలస్నానం చేయాలి.లేదా మీ రెగ్యులర్ ఆయిల్ మాదిరిగానే ఈ ఆయిల్ ను కూడా ఉపయోగించవచ్చు.ఇక ఈ ఆయిల్ హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేయడంలో చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది.

కొత్త జుట్టు ఎదుగుదలకు మద్దతు ఇస్తుంది.పల్చటి జుట్టును ఒత్తుగా మారుస్తుంది.

జుట్టు రాలడాన్ని అరికడుతుంది.అలాగే వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడటం వల్ల చుండ్రు సమస్యకు కూడా గుడ్ బై చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube