గత వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ , వాలంటరీ, సచివాలయ వ్యవస్థ విషయంలో టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు .గత వైసిపి ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయగా, ప్రస్తుత టిడిపి ప్రభుత్వం వాలంటీర్లను ఈ విధుల నుంచి తప్పించి వార్డు, సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్లను ఒకటో తేదీన పంపిణీ చేయించింది.
జులై ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగింది. వాలంటీర్ల ప్రమేయం లేకుండానే ఒక్క రోజులోనే దాదాపు 90 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్లను ఏపీ ప్రభుత్వం అందించింది.
గ్రామ , వార్డు , సచివాలయ ఉద్యోగులు ఈ విషయంలో సమర్థవంతంగా తమ విధులను నిర్వహించడంతో ఏపీ ప్రభుత్వం వీరికి మరో కీలక బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఏపీవ్యాప్తంగా సర్వే చేయించేందుకు సిద్ధం అవుతుంది. ఏపీలో విద్యార్థులు, నిరుద్యోగులకు ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం స్కిల్ సెన్సెస్( Skill senses ) అనే కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన తొలి క్యాబినెట్ మీటింగ్ లో స్కిల్ సెన్సెస్ కార్యక్రమం అమలు విషయంపై మంత్రివర్గం లో చర్చించి దీనికి ఆమోదముద్ర వేశారు .ఈ స్కిల్ సెన్సెస్ లో వివిధ శాఖలను భాగస్వామ్యం చేసే విధంగా విధివిధానాలను మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిన్న చర్చించారు. గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ సర్వే చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సెస్ ప్రోగ్రాం ద్వారా , స్వదేశం , విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులలో యువతకు శిక్షణ ఇవ్వబోతున్నారు. దీని ద్వారా నైపుణ్యాభివృద్ధిలో యువతకు ఉపాధి కల్పనకు పెద్దపేట వేయనున్నారు .గ్రామాల్లో చదువుకున్న యువత ఏ ఏ రంగాల్లో శిక్షణ పొందేందుకు ఆసక్తిగా ఉన్నారనే విషయాల పైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు.