సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ఉత్సాహం చూపుతుంటారు.అలా చేయడం వల్ల తమలో ఉన్న టాలెంట్ బయట ప్రపంచానికి తెలుస్తుంది అని వారు ఆరాటపడతారు.
అందుకోసం భిన్నమైన కథలను, భిన్నమైన పాత్రను ఎంచుకోవడానికి ఇష్టపడుతుంటారు.అలా ఒక విభిన్నమైన కోణంలో వారిని వారు ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం.
అలాగే ఇలా కొత్త పాత్రలు చేయడం వల్ల కొంతమంది ఎంతో పాపులారిటీ కూడా సంపాదించుకున్నారు.ఇక మన టాలీవుడ్ లో వచ్చిన కొన్ని సినిమాల్లో హీరోలు తమ పాత్రలను తామే డిజైన్ చేసుకున్నారట.
వారి లుక్ ఎలా ఉండాలో, పాత్ర తీరుతెన్నుల విషయంలో ఎంతో జాగ్రత్త వహించారట.ఇంతకీ ఆ హీరోలు ఎవరు ? వారు డిజైన్ చేసుకున్న ఆ పాత్రలు ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కమల్ హాసన్

లోక నాయకుడు అయిన కమల్ హాసన్( Kamal Haasan ) ఇప్పటి వరకు పోషించని పాత్ర లేదు వెయ్యని గెటప్ లేదు.ఇక తాజాగా కల్కి సినిమాలో( Kalki ) ఆయన నటించారు ఈ సినిమాలో కమల్ ని కొత్తగా చూపించాలని నాగ్ అశ్విన్ అనుకున్నారట.అయితే ఇంకా ఆయన వెయ్యని పాత్ర లేదు కాబట్టి ఎలా చూపించాలో ఆ దర్శకుడికి అర్థం కాలేదు.దాంతో కమల్ హాసన్ రెండుసార్లు అమెరికా వెళ్లి చాలా విషయాలను రీసెర్చ్ చేసి తన పాత్రను తానే డిజైన్ చేసుకున్నాడట.
పవన్ కళ్యాణ్

గబ్బర్ సింగ్( Gabbar Singh ) సినిమాలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అంతకు ముందు ఎప్పుడూ కనిపించనంత ఉత్సాహంగా అలాగే కొత్తగా కూడా కనిపించారు.అయితే ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన గెటప్ డిజైన్ తానే చేసుకున్నారట ఇలాంటి బట్టలు వేసుకోవాలి ఎలా చేయాలి అనేది పవన్ కళ్యాణ్ సొంతంగా తీసుకున్నరట.దానికోసం అంతకుముందు తాను నటించిన గుడుంబా శంకర్ సినిమాను రిఫరెన్స్ గా తీసుకున్నారట.