మంచు విష్ణు( Vishnu ) తన డ్రీం ప్రాజెక్ట్ అయిన కన్నప్ప( Kannappa ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ఏప్రిల్ నెలలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగము కావటం విశేషం.
ఇక ఈ సినిమా టీజర్ విడుదలవుతున్న నేపథ్యంలో మంచు విష్ణు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఇలా మీడియా సమావేశంలో భాగంగా సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.ప్రస్తుతం ఎందుకో సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ వీడియోలపై ఒక నెటిజన్ మంచు విష్ణుని సినిమాకు సంబంధించిన వివరణలు అడిగితే.
కొంతమంది విష్ణు వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించారు.నెటిజన్లలో ఒకరు, మంచు కుటుంబానికి సంబంధించిన ఓ వివాదం గురించి ప్రశ్నించారు.
మాకు సమాధానం ఇచ్చే మంచి మనసు నీది.మరి ఆ రోజు జనరేటర్‌లో( Generator ) షుగర్( Sugar ) ఎందుకు వేశావ్ అన్నా అంటూ ప్రశ్నించారు.

ఇలా నెటిజన్ జనరేటర్ లో షుగర్ ఎందుకు వేశావు అన్నా అంటూ అడిగిన ప్రశ్నకు మంచు విష్ణు స్పందిస్తూ.జనరేటర్ లో షుగర్ వేస్తే ఎక్కువ మైలేజ్ వస్తుందని నేను ఎక్కడో చదివాను అందుకే వేసాము అంటూ సరదాగా సమాధానం చెప్పారు.ఇలా మంచు విష్ణు చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.గత కొంతకాలంగా మంచు కుటుంబంలో గొడవలు ఉన్న సంగతి మనకు తెలిసిందే అయితే తాను ఇంట్లో లేని సమయంలో మంచు విష్ణు తన మనుషులతో మా ఇంట్లోకి చొరబడి జనరేటర్ లో చక్కెర పోసి ఇంట్లో కరెంట్ లేకుండా చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు అంటూ మనోజ్( Manoj ) ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.