1.కెసిఆర్ నివాసం వద్ద టిఆర్ఎస్ మహిళ నేత ధర్నా
ఢిల్లీలోని కెసిఆర్ నివాసం వద్ద టీఆర్ఎస్ మహిళా నేత ధర్నాకు దిగారు.ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టిఆర్ఎస్ ఉస్మానియా యూనివర్సిటీ మహిళా విభాగం ప్రెసిడెంట్ స్వప్న ఢిల్లీలో కేసీఆర్ నివాసం వద్ద ఆందోళనకు దిగారు.
2.కెసిఆర్ పై రేవంత్ రెడ్డి కామెంట్స్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.ఐదేళ్లు మహిళలకు క్యాబినెట్ లో స్థానం ఇవ్వని కేసీఆర్ మునుగోడులో ఒక ఆడబిడ్డను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.
3.బాసర ఆలయంలో తాత్కాలిక మరమత్తులు
బాసర సరస్వతి దేవి ఆలయంలో అధికారులు మరమత్తులు చేపట్టారు.
4.పోస్టర్ల వ్యవహారంపై ఈటెల కామెంట్స్
హుజురాబాద్ , దుబ్బాక ప్రజల పేరిట వెలిసిన పోస్టర్లు బూటకం అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
5.రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.16 న రాష్ట్రంలో ని 1,019 కేంద్రాల్లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది.
6.పథకాల పేరిట ఓట్లు దండుకుంటున్న కేసీఆర్
కాళేశ్వరం డబ్బుతోనే కేసీఆర్ విమానం కొనుగోలు చేశారని, రాష్ట్ర ప్రజలను మోసం చేసి కెసిఆర్ ఓట్లు దండుకుంటున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
7.విద్వేష ప్రసంగం కేసులో అక్బరుద్దీన్ కు నోటీసులు
హిందువులకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగం చేసిన కేసులో ఎం ఐ ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
8.హైదరాబాద్ కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్
హైదరాబాద్ కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ లభించింది.ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టీ కల్చర్ ప్రొడ్యూసర్స్ సంస్థ దక్షిణ కొరియా లో నిర్వహించిన సమావేశం లో ఈ అవార్డ్ ను ప్రకటించింది.
9.బీజేపీ లోకి బూర నరసయ్య గౌడ్
మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ కు భారీ షాక్ తగలనుంది.ఆ పార్టీ నేత , భువనగిరి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ బీజేపీ లో చేరనున్నారు.
10.అచ్చెన్న నాయుడు కామెంట్స్
ఏపీని నలుగురు రెడ్లు దోచుకుంటున్నారు అని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.
11.ఉత్తరాంధ్రకు వైసిపి చేసింది ఏమీ లేదు : టీడీపీ ఎంపీ
ఉత్తరాంధ్ర ప్రాంతానికి వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని టిడిపి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు.
12.జగన్ రాజీనామా చేయాలి
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షుల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేయడం తీవ్రమైన విషయమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు.సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.
13.మూడు రాజధానులకు బిజెపి వ్యతిరేకం
మూడు రాజధానులకు బిజెపి వ్యతిరేకమని కేంద్రమంత్రి మురళీధరన్ స్పష్టం చేశారు.
14.జగన్ పై లోకేష్ కామెంట్స్
జగన్ రెడ్డి చెప్పే మాటలు వేరు చేసే పనులు వేరని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
15.దేశంలో ఒక సీటు కూడా గెలవలేని స్థితిలో సీపీఐ : వీర్రాజు
దేశంలో ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితుల్లో సిపిఐ ఉందని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.
16.ఏపీలో రెండు రోజులు పాటు భారీ వర్షాలు
ఏపీలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
17.పోలీస్ శాఖ అలెర్ట్
పీ ఎఫ్ ఐ కార్యకర్తల దాడులపై తెలంగాణ ఇంటిలిజెన్స్ అప్రమత్తం అయ్యింది.హిందూ కార్యకర్తలపై పిఎఫ్ఐ దాడులు చేసేందుకు కుట్ర చేస్తుందని, నిఘా ఉంచాలని హెచ్చరికలు జారీ చేసింది.
18.వైసీపీ ఎమ్మెల్యే సవాల్
టీడీపీ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు.స్వచ్ఛందంగా నా అవినీతిపై , అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని కోరుతున్నానని, అలాగే లోకేష్ , అచ్చెన్నాయుడు , సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ ఆస్తులపై సిబిఐ విచారణ చేయాలని అడుగుతారా అని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు.
19.జగన్ ప్రభుత్వంలో భూ కుంభకోణాలు ఎక్కువయ్యాయి
భూ కుంభకోణాలు జగన్ ప్రభుత్వంలో ఎక్కువయ్యాయని బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు.
20.పెన్నా నది ఉగ్ర రూపం
పెన్నా నది ఉగ్ర రూపం దాల్చింది. అనంతపురంలో కుండపోత వర్షాలు కురుస్తున్న కారణంగా… గండికోట లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.