డార్క్ సర్కిల్స్.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని వేధించే చర్మ సమస్యల్లో ఇది ఒకటి.ముఖం మొత్తం తెల్లగా, అందంగా ఉన్నా.కళ్ళ చుట్టూ మాత్రం నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, స్మార్ట్ఫోన్లును ఓవర్‌గా వినియోగించడం, పోషకాల కొరత, పలు రకాల మందుల వాడకం, కెమికల్స్ ఎక్కువగా ఉండే స్కిన్ ప్రోడెక్ట్స్‌ను వాడటం, నిద్ర లేమి, ధూమపానం వంటి కారణాల వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.అయితే కారణం ఏదైనా ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీని ప్రతి రోజు తీసుకుంటే డార్క్ సర్కిల్స్ మటుమాయం అవ్వడమే కాదు మరిన్ని స్కిన్ కేర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
మరి లేటెందుకు ఆ హెర్బల్ టీ ఏంటో.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.? చూసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే లైట్‌గా క్రష్ చేసిన ఐదు తులసి ఆకులు, చిన్న దంచిన అల్లం ముక్క, చిటికెడు కుంకుమ పువ్వు వేసి ఆరు నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఆ తర్వాత టీని ఫిల్టర్ చేసుకుని రుచి కోసం కొద్దిగా తేనె కలిపి ఉదయాన్నే సేవించాలి.ఇలా ప్రతి రోజు చేయడం వల్ల తులసి, అల్లం మరియు కుంకుమ పువ్వులో ఉండే ప్రత్యేకమైన సుగుణాలు కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను క్రమంగా తగ్గించేస్తాయి.అలాగే ఈ హెర్బల్ టీని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, కంతి వంతంగా మెరిసి పోతుంది.
వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.మరియు మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలకు సైతం దూరంగా ఉండొచ్చు.కాబట్టి, ఖచ్చితంగా ఈ హెర్బల్ టీ తీసుకోవడానికి ప్రయత్నించండి.