ఈ సమస్యలు ఉన్నవారు.. కాకరకాయను అస్సలు తీసుకోకూడదు..!

మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కూరగాయలు( Vegetables ) తీసుకోవడం చాలా మంచిది అని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు.ఆరోగ్యంగా ఉండేందుకు కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని సిఫార్సు చేస్తూ ఉంటారు.

 Those Who Have These Problems Should Not Take Bitter Gourd At All , Bitter Gourd-TeluguStop.com

అయితే ఇందులో కాకరకాయ కూడా ఒకటి.ఇది రుచికి చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

దీని చేదు కారణంగానే చాలా మంది దీన్ని తినడానికి అసలు ఇష్టపడరు.

కాకరకాయ( Bitter Gourd ) తినడానికి నిరాకరిస్తారు.

అయితే దాని విస్తృత ప్రయోజనాల కారణంగా కాకరకాయను ఉత్తమ ఆహారంలో భాగంగా చేసుకునే వారు కూడా ఉన్నారు.అయితే చేదు కొన్నిసార్లు మీ శరీరానికి హానికరం కూడా.

ఎందుకంటే కాకరకాయ కొన్ని దుష్ప్రభావాలు కూడా కలిగిస్తుంది.రక్తం లో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నప్పుడు కాకరకాయను అసలు తీసుకోకూడదు.

ఇక డయాబెటిక్( Diabetic ) వారికి అయితే కాకరకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కానీ కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో చాలా సహాయపడుతుంది.అందుకే రక్తంలో చక్కెర స్థాయి( Sugar level ) తక్కువగా ఉంటే పొరపాటున కూడా కాకరకాయను అస్సలు తీసుకోకూడదు.దీని వలన రక్తంలో చక్కెర స్థాయి తగ్గే అవకాశం ఉంది.

ఇక గర్భధారణ సమయంలో కూడా కాకరకాయను అసలు తీసుకోకూడదు.గర్భవతులకు కాకరకాయ హాని తలపెడుతుంది.

ఎందుకంటే కాకరకాయలోని మేమోచ్రిన్ ( Maymochrin )కంటెంట్ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి చాలా హానికరం.అలాంటి పరిస్థితుల్లో కాకరకాయను వీలైనంతవరకు దూరంగా ఉంచాలి.కాకరకాయ కాలయానికి కూడా హానికరం.కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం.అందుకే దీని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.ప్రతిరోజు కాకర కూర తినడం కాకరకాయ జ్యూస్ తాగడం లాంటివి చేస్తే కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.

అలాగే పదేపదే కాకరకాయ తీసుకోవడం వలన కూడా విరేచనాలు వస్తాయి.అలాగే వాంతుల సమస్య కూడా పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube