శుభవార్త చెప్పిన టెక్ దిగ్గజం.. 'వేరియబుల్ పే'పై కీలక ప్రకటన!

గడ్డు పరిస్థితుల మధ్య కూడా టెక్( Tech ) దిగ్గజం హెచ్‌సీఎల్‌ ( HCL )దుమ్ములేపింది.ఈ క్రమంలో ఈ ఉద్యోగులు వేచిచూస్తున్న వేరియబుల్ పే ( variable pay )విషయంపై ఓ కీలక ప్రకటన చేసింది.

 Tech Giant Who Gave Good News Key Announcement On Variable Pay ,tech Giant, Hcl,-TeluguStop.com

వేరియబుల్ పే అంటే మీకు తెలిసినదే.ఉద్యోగి పరిహారంలో ఒక భాగం.

ఇది కంపెనీ పనితీరు, వ్యక్తిగత ఉద్యోగుల పనితీరుపై నిర్ణయించబడి ఉంటుంది.గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.3,593 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయగా.తాజా ఫలితాల్లో 10.80 శాతం వృద్ధితో రూ.3,983 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించడం విశేషం.

ఈ క్రమంలో హెచ్‌సీఎల్‌ క్యూ4 ( HCL Q4 )లో 85 శాతం మంది ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని చెల్లించాలని నిర్ణయించడం విశేషం.ఇదే విషయాన్ని చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామ్ సుందరరాజన్ ఎర్నింగ్ కాల్ సందర్భంగా వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ Q4 FY23కి వేరియబుల్ పే మునుపటి త్రైమాసికాల మాదిరిగానే ఉంటుందని స్పష్టం చేశారు.ఇదే క్రమంలో కంపెనీ ఒక్కో షేరుకు రూ.18 డివిడెండ్ చెల్లించనున్నట్లు కూడా ప్రకటించారు.

అయితే ప్రస్తుత గడ్డు పరిస్థితులలో కొత్త నిమయకాలు స్పీడు తగ్గినట్లు వివరించారు.గత సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోల్చిచూస్తే కొత్త నియామకాలు 57 శాతం తగ్గి 17,067గా నిలిచాయి.అయితే.

నియామకాల సంఖ్య గత క్యూ4లో 39,900గా ఉంది.ఇక వ్యాపారం విషయానికి వస్తే.

కంపెనీ పైప్‌లైన్ ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుందని హెచ్‌సీఎల్‌ CEO విజయ్ కుమార్ వెల్లడించారు.ఇది బలమైన క్లయింట్ డిమాండ్‌ను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.

పైగా ఆరోగ్యకరమైన రాబడి వృద్ధిని సాధించటానికి మార్జిన్లు సహాయంగా నిలుస్తాయన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube