వర్షాకాలం వచ్చిందంటే రోగాలకు దారి తీసే కాలం అని చెప్పవచ్చు.ఇందులో కొన్ని రోగాలు ప్రాణాంతకం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
ఆ వివరాలు తెలుసుకుందాం.మలేరియా, డెంగీ దోమలు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది.
ఇక కరోనా అయితే, ఎలా వ్యాపించిందో ఈజీగా చెప్పలేం.కానీ, వీటి లక్షణాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి.
మలేరియా, డెంగీ ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపిస్తుంది.ఇది చివరకు ప్రాణాంతకంగా కూడా మారుతుంది.
ఈ మూడు ఇన్ఫెక్షనల్లలో ఏది ఏ లక్షణమని గుర్తించాలో తెలుసుకుందాం.ఈ మూడు వ్యాధులు శ్వాసకోశకు సంబంధించినవి.
కడుపులో మంటను కలిగిస్తాయి.అయితే, కొవిడ్, మలేరియా, డెంగీ వ్యాధులకు ఒకేరకమైన జ్వరం, చలి, దగ్గు, జలుబు, గొంతునొప్పి, తలనొప్పి, అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మైయాల్జియా– ఇవన్నీ లక్షణాలే.
డెంగీ సోకినపుడు ఒక వ్యక్తికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, వికారం, కడుపు నొప్పి, విరేచనాలు వస్తాయి.డెంగీ రోగులు శ్వాసకోశ బాధతోపాటు ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, రక్తపోటు తగ్గడం వల్ల కొన్నిసార్లు షాక్‌కు కూడా గురవుతారు.అదే మలేరియా బారిన పడినపుడు ఆ వ్యక్తికి జ్వరం, తలనొప్పి, చలి ముఖ్యమైన లక్షణాలు.ఇది మొదలైన 24 గంటల్లో చికిత్స చేయకపోతే, వ్యాధి తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది.
ఒక్కోసారి మరణానికి కూడా దారి తీస్తుంది.మలేరియా సోకిన పిల్లల్లో మెటబాలిక్ అసిడోసిస్, సెరిబ్రల్ మలేరియాకు సంబంధించి తీవ్రమైన రక్తహీనత, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడతారు.
వీటిని గుర్తించే విధానం
కరోనా సోకినపుడు సదరు వ్యక్తికి ముఖ్యంగా రుచి, వాసన కోల్పోతాడు.అటువంటి వ్యక్తుల్లో దగ్గు, వాయిస్‌లో మార్పు, గొంతులో చికాకు, ఎగువ శ్వాసకోశంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.డెంగీ, మలేరియాకు ఈ లక్షణాలు ఉండవు.కొవిడ్ 19లో జీర్ణాశయాంతర లక్షణాలు సాధారణం కాదు.డెంగీ, మలేరియాలో శ్వాస లేకపోవడం, ఛాతినొప్పి, శ్వాస సమస్యలు సర్వసాధారణం.డెంగీ, మలేరియా, తరచూ తలనొప్పి, బలహీనత మొదలవుతాయి.
అదే కొవిడ్ 19కి ఈ లక్షణాలు ఉండవు.కరోనా లక్షణాలు త్వరగానే గుర్తించవచ్చు.
అంటే 2–3 రోజులు.డెంగీ, మలేరియాను గుర్తించడానికి ఒక్కోసారి 22–25 రోజులు కూడా పడుతుంది.