సాధారణంగా జుట్టు చివర్లు చిట్లినప్పుడు కొంచెం జుట్టును కట్ చేస్తూ ఉంటాం.ఇలా చేయటం వలన సమస్య తాత్కాలికంగా తగ్గుతుంది.
కానీ పూర్తిగా తగ్గదు.అందువల్ల కొన్ని సహజమైన చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు.
ఈ చిట్కాలతో ముఖ్యంగా అవకాడో అద్భుతంగ పనిచేస్తుంది.ఇప్పుడు అవకాడోతో చిట్లిన జుట్టు సమస్యను ఎలా అధికమించవచ్చో తెలుసుకుందాం.
బాగా పండిన అరటిపండు గుజ్జులో ఒక అవకాడో పేస్ట్, 4 స్పూన్ల రోజ్ వాటర్ కలపాలి.ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
మూడు స్పూన్ల బాదాం ఆయిల్ లో రెండు స్పూన్ల అవకాడో ఆయిల్ ని కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.
ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి.
బాగా పండిన బొప్పాయి గుజ్జులో ఒక అవకాడో పేస్ట్ కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.
ఈ విధంగా నెలలో రెండు సార్లు చేయాలి.
రెండు స్పూన్ల అవకాడో పేస్ట్ లో రెండు స్పూన్ల తేనే కలిపి తలకు పట్టించి 40 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.
ఈ విధంగా వారానికి ఒక సారి చేయాలి.