పాలలో కంటే ఈ ఆహార పదార్థాలలో కాల్షియం ఎక్కువ...

ప్రతిరోజు మన శరీరానికి చాలా కాల్షియం అవసరం అవుతుంది.అయితే ప్రతి రోజు కాల్షియం ఉండే ఆహార పదార్థాలను మనం తీసుకుంటే సరిపోతుంది.

 These Foods Have More Calcium Than Milk Details, Calcium, Calcium Foods, Milk ,-TeluguStop.com

మన లో ప్రతి ఒక్కరూ పాలు తీసుకుంటే మన శరీరనికి ఎక్కువ క్యాల్షియం అందుతుందని అనుకుంటారు.పాలలో కంటే కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి.

మరి కొంత మందికి పాలు అంటే ఇష్టం ఉండదు.అలాంటివారు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే వారి శరీరానికి కావలసినంత కాల్షియం అందుతుంది.

మన శరీరం లోని ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం.కాల్షియం మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.కాల్షియం విటమిన్ డి తో కలిసి అధిక రక్తపోటు, క్యాన్సర్, మధుమోహం వంటి వ్యాధుల భారిన పడకుండా కాపాడుతుంది.తోటకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

వారంలో రెండు మూడు సార్లు తోటకూర తీసుకుంటే మన ఎముకలు బలంగా ఉంటాయి.నల్ల నువ్వుల లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

నువ్వులు బెల్లం కలిపి తింటే మన శరీరానికి కావలసినంత కాలుష్యం లభిస్తుంది.

Telugu Anjeer, Calcium, Calcium Foods, Tips, Milk, Oats, Vitamin-Telugu Health

ఇంకా చెప్పాలంటే అంజీర పండ్ల లో క్యాల్షియంతో పాటు ఫైబర్, ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటాయి.రాత్రి రెండు అంజిర పండ్లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని తిని, నీటిని కూడా తాగాలి.ఇలా ప్రతిరోజు రెండు అంజీర పండ్లను తినడం వల్ల మన శరీరంలోని క్యాల్షియం లోపం తగ్గడమే కాకుండా రక్తహీనత సమస్య కూడా ఎప్పటికీ రాదు.

ఓట్స్ ను వారానికి రెండు రోజులు తింటే మన శరీరానికి కాల్షియం మరియు ఫైబర్ అధికంగా లభిస్తాయి.ఓట్స్ ను తరచుగా తీసుకుంటే కాల్షియం లోపం తగ్గడమే కాకుండా అధిక బరువు కూడా తగ్గవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube