ఆ జిల్లాలో టీడీపీ టికెట్ల ఖరారు ! ఏ నియోజకవర్గానికి ఎవరెవరంటే ?

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపి అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు.

వరుసగా జిల్లాలు , నియోజకవర్గాల్లో పర్యటిస్తూ  ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు,  పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ఈ కార్యక్రమాలు చేపట్టే విధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

అధికార పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్నా,  దానికి దీటుగా టిడిపిని ముందుకు తీసుకు వెళ్ళడంలో బాబు సక్సెస్ అవుతూనే ఉన్నారు.వైసీపీ ప్రభుత్వం పై మొదట్లో ప్రజల్లో ఉన్నంత సానుకూలత ఇప్పుడు లేదనే అభిప్రాయంతో ఉన్న బాబు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన కసరత్తును ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నారు.

దీనికోసమే ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీలో ముందస్తుగా పార్టీ అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.     ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బాబు తాజాగా గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించి సంచలనానికి తెరలేపారు.

ఇప్పటికీ టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ లిస్టులో టిడిపితో అంటీ ముట్టనట్లు గా వ్యవహరిస్తున్న మాజీమంత్రి విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు.

Advertisement

తాజాగా ప్రకటించిన నియోజకవర్గ టీడిపి అభ్యర్థుల లిస్టు ఒకసారి పరిశీలిస్తే.గుంటూరు జిల్లా లో పొన్నూరు నుంచి దూళిపాళ్ల నరేంద్ర కుమార్,  తెనాలి నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా,  మంగళగిరి నుంచి నారా లోకేష్,  వేమూరి నుంచి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు,  బాపట్ల నుంచి వేగేసిన నరేంద్ర వర్మ,  రేపల్లె నుంచి అనగానే సత్యప్రసాద్, చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట నుంచి డాక్టర్ అరవింద్ బాబు , వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు,  పెద్దకూరపాడు నుంచి కొమ్మలపాటి శ్రీధర్ కు సీట్లు ఖరారు చేశారు.

ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థులను ముందుగానే ప్రకటించి వారు క్షేత్రస్థాయిలో చురుగ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ,  ప్రజల కు మరింత దగ్గరయ్యే విధంగా చంద్రబాబు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు