రానా దగ్గుబాటి…వెనకాల కొండంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న కూడా తాను ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాడు.రానా అడిగితే ఎవరైనా కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు.
సొంత స్టూడియో, ఇంట్లో దిగ్గజ నిర్మాత అయినా సురేష్ బాబు ఉన్నప్పటికి అయన సినిమాలు తీసే విధానం, సెలెక్ట్ చేసే స్క్రిప్ట్ పంథా వేరుగా ఉంటుంది.ఒక్క ముక్కలో చెప్పాలంటే అయన స్క్రిప్ట్ సెలక్షన్ ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది.
కేవలం నటుడు మాత్రమే కాదు స్వయంగా తండ్రిని, తాతని మించిన నిర్మాత అయ్యే సత్తా ఉన్న వ్యక్తి రానా.
భవిష్యతులో సినిమా నిర్మాణం ఒక చేత స్టార్ గా సినిమాలు ఒక చేత అలవోకగా సినిమాను నడిపించగల నైపుణ్యం అయన సొంతం.
సినిమా తెర ముందు చూసి చెప్పడం చాల తేలిక.కానీ అన్ని విభాగాలను భుజాన వేసుకొని సినిమా చేయించడం చాల కష్టం.కానీ రానా కి ఇది ఎంతో ఇష్టం.ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఒక ఉదాహరణ చెప్తాను మీలో ఎంత మంది లక్ష్మి సినిమా చూసారు.చూడకపోతే ఇప్పుడు ఒక్కసారి తప్పకుండా చుడండి.లక్ష్మి సినిమాలో వేణు మాధవ్ మరియు తెలంగాణ శకుంతల మధ్య నడిచే ఒక యానిమేషన్ సీన్ ఉంటుంది.
ఆ సీన్ లో హాస్యం పండాలంటే అది నిజంగా చేసిన సరిపోతుంది.కానీ దానికి యానిమేషన్ జోడించి అత్యద్భుతంగా సీన్ ని పండించింది రానా నే.అంతే కాదు ఆయనే ఆ యానిమేషన్ డిజైన్ కూడా చేసారు.తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా మాత్రమే ప్రపంచం.సినిమాలు లేకుండా రానా ని ఊహించలేం.కేవలం సినిమాలు తీసి డబ్బు జేబులో వేసుకోవడం కాదు సినిమా అంటే, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఉన్నతికి కారణం రానా అంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
ఈ విషయం స్వయంగా సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.తాత అంశతో పుట్టారు.తాతను ని, తండ్రిని మించి ఖచ్చితంగా గొప్ప వాడు అవుతాడు.38 వ పడి నుంచి 39 లోకి అడుగు పెట్టిన బ్రిలియంట్ పర్ఫార్మర్ రానా దగ్గుబాటి.