7 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆ దేవాలయానికి భక్తుల క్యూ..

ఖర్సాలీ గ్రామం ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లలో ఒకటైన యమునోత్రికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ గ్రామంలో శని దేవుడు,అతని సోదరి యమునల ఆలయం ఉంది.

 A Temple Of Shani Dev And Yamuna At An Altitude Of 7 Thousand Feet Details, Shan-TeluguStop.com

ఈ దేవాలయం వేసవిలోని వైశాఖి సందర్భంగా భక్తుల కోసం తెరుస్తారు.ఏప్రిల్ 30న శని అమావాస్య.

ఈ రోజున దేశవ్యాప్తంగా శని దేవాలయాల్లో భక్తుల రద్దీ ఉంటుంది.ఉత్తరాఖండ్‌లో ఉన్న ఈ శని దేవుడి ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవి కాలంలో ఇక్కడికి రావడం చాలా ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది.ఖర్సాలీలో శీతాకాలంలో మంచు కురుస్తుంది.

ఈ కారణంగా ఈ శని దేవాలయం తలుపులు మూసివేస్తారు.

వేసవి ప్రారంభం కావడంతో భక్తులకు వాతావరణం అనుకూలంగా మారుతుంది.

దీంతో భక్తులు శని దేవుడిని చూడటానికి సులభంగా ఇక్కడికి చేరుకుంటారు.ఈ శని దేవాలయం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా ఖర్సాలీ గ్రామంలో సముద్ర మట్టానికి సుమారు 7 వేల అడుగుల ఎత్తులో ఉంది.

ఈ ఆలయం చాలా పురాతనమైనది.ఈ ప్రాంతీయులు తెలిపిన వివరాల ప్రకాచం శని దేవుడు తన సోదరి యమునను కలవడానికి ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు యమునోత్రిని సందర్శిస్తాడు.

Telugu Thousandfeet, Kharsali, Shaneeshwara, Shani Amavasya, Shani Dev, Shani Te

యమునోత్రి నుండి శని దేవాలయం దాదాపు 5 కి.మీ.దూరాన ఉంటుంది.యమునోత్రికి వచ్చే చాలా మంది భక్తులు శనిదేవాలయాన్ని సందర్శిస్తారు.

ఇక్కడి చరిత్ర మహాభారత కాలం నాటిదని నమ్ముతారు.ఐదుగురు పాండవులు తమ ప్రయాణ సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించారంటారు.

ఈ ఆలయం ఐదు అంతస్తులతో ఉంది.రాతి, చెక్కతో దీనిని నిర్మించారు.

ఆలయంలో శని దేవుడి కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు.ఆలయంలో నిత్యం దీపం వెలుగుతూనే ఉంటుంది.

ఈ కాంతి మధ్య శనిదేవుని విగ్రహం కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube