భూమి పై పుట్టిన ప్రతి మనిషి కి మరణం అనేది తప్పదు అని దాదాపు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు.ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా దహన సంస్కారాలు( Cremation ) జరుపుతూ ఉంటారు.
మన భారతదేశంలో ఉన్న చాలా సాంప్రదాయాలను మన ప్రజలు కచ్చితంగా పాటిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే సనాతన ధర్మంలో చనిపోయిన వ్యక్తికి నియమ నిబంధనల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహిస్తూ ఉంటారు.
అందులో భాగంగానే సూర్యాస్తమయం( sunset ) అయిన తర్వాత దహనం చేయరు.ఎందుకంటే సూర్యాస్తమయంలో స్వర్గ ద్వారములు మూసి వేయబడతాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
ఇంకా చెప్పాలంటే మన పెద్ద వారు మృతదేహాన్ని రాత్రి సమయంలో ఒంటరిగా వదిలి వెళ్ళకూడదని చెబుతుంటారు.అయితే దీని వెనుక గల కారణం ఏంటో చాలా మందికి తెలియదు.
ఇంకా చెప్పాలంటే దీనికి సంబంధించిన అసలు కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి సమయంలో చాలా దుష్టశక్తులు( Evil spirits ) చురుకుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే మృతదేహాన్ని ఒంటరిగా ఉంచినప్పుడు ఈ దుష్టశక్తులు అ మృతదేహం లోకి ప్రవేశించి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సృష్టిస్తాయని పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా గరుడ పురాణం( Garuda Puranam ) ప్రకారం మరణించిన తర్వాత మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ మృత దేహం చుట్టూ తిరుగుతూ ఉంటుంది.ఆత్మకు ఆ శరీరంతో గొప్ప అనుబంధం ఉన్నందున ఆత్మ మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించాలని కోరుకుంటూ ఉంటుంది.అటువంటి పరిస్థితి లో అక్కడ ఉన్న వారిని చూసినప్పుడు బాధపడుతూ ఉంటుంది.
అందుకే మృతదేహాన్ని వదిలి వెళ్ళకూడదు.ఈ కారణాల వల్లనే రాత్రి సమయంలో ఒంటరిగా మృతదేహాన్ని ఉంచకూడదని పండితులు చెబుతున్నారు.
కచ్చితంగా కొంతమంది అయిన మృతదేహం దగ్గర ఉండాలి.