జూలై 29వ తేదీన పద్మిని ఏకాదశి( Padmini Ekadashi )కి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ రోజున చాలా మంది ప్రజలు ఉపవాసం చేస్తారు.
ఉపవాసం చేసే విధానం నుంచి దానీ పూజా, శుభ ముహూర్తాల వరకు వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఉపవాసం విష్ణు కోసం ఆచరిస్తారు.
పద్మిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వారికి విష్ణు లోకం ప్రాప్తిస్తుందని, అలాగే ఈ వ్రతం అనేక యాగాల ఫలాలను కూడా ఇస్తుందని చెబుతూ ఉంటారు.పద్మిని ఏకాదశి రోజున కన్నెపిల్లలు, పెళ్లి కానీ వారు ఉపవాసం ఉండి పూజ చేసినట్లయితే మంచి భర్త, పురుషులకైతే మంచి భార్య లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా చెప్పాలంటే అధిక శ్రావణమాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజు( Shukla paksha ekadashi ) ఉపవాసం ఉండే వ్యక్తికి కూడా సంతానం కలుగుతుంది.ఇంట్లో పిల్లల ఆనందం చూడాలనుకునే వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి.ఉపవాసం ఎప్పుడు దానిని పాటించే సరైన పద్ధతి ఏమిటి? ఏ శుభ సమయంలో ఆచరించాలి అని చాలా మందికి తెలియదు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏడాది 2023లో పద్మినీ ఏకాదశి జూలై 29 శనివారం అధికమాసంలో రాబోతుంది.

2023 ఏడాదిలో పద్మిని ఏకాదశికి రెండు గంటల 42 నిమిషాలు మాత్రమే శుభ సమయం ఉంటుంది.జులై 30న సాయంత్రం 5 గంటల 45 నిమిషముల 58 సెకండ్ల నుంచి ఎనిమిది గంటల 23 నిమిషముల 30 సెకండ్ల వరకు ఉంటుంది.ఇంకా చెప్పాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి విష్ణువును పద్ధతిగా పూజించాలి.ముఖ్యంగా చెప్పాలంటే పద్మినీ ఏకాదశి రోజున నీరులేని ఉపవాసం పాటించి విష్ణుపురాణాన్ని( Lord vishnu ) పాటించాలి.
అలాగే రాత్రిపూట శ్లోకాలు పటిస్తూ ఉపవాసం ఉన్న వారిని మేలుకొనేలా చేయాలి.అలాగే రాత్రి ప్రతి గంటకు విష్ణువు మరియు శివున్ని( Lord Shiva ) పూజించాలి.
ద్వాదశి రోజున ఉదయాన్నే భగవంతుణ్ణి పూజించాలి.అలాగే బ్రాహ్మణునికి తినిపించిన తర్వాత దక్షిణతో పంపించాలి.
ముఖ్యంగా చెప్పాలంటే దీనీ తర్వాత మాత్రమే మీరు తినడం కానీ త్రాగడం కానీ చేయవచ్చు.
DEVOTIONAL