శ్రీ కృష్ణ పరమాత్ముడి అన్న బలరాముడికి అన్ని పేర్లు ఉన్నాయా?

దేవకీ వసుదేవుల పెద్ద కుమారుడు, శ్రీ కృష్ణ పరమాత్ముడి అన్న బల రాముడు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే.వీరికి ఒక చెల్లెలు సుభద్ర కూడా ఉంది.

 How Many Names Have Bala Ramudu , Bala Ramudu , Devotional, Sri Krishnudu, Telug-TeluguStop.com

కానీ అన్నాదమ్ములిద్దరూ దేవకీ వసుదేవుల వద్ద కాకుండా యశోదా నందుల వద్ద వ్రేపల్లెలో పెరిగారు.కానీ ఆయనకు ఎన్ని పేర్లు ఉన్నాయనే విషయం మాత్రం చాలా మందికి తెలీదు.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బల రాముడికి మొత్తం 13 పేర్లు అన్నాయి.

అందులో మొదటిది బల భద్రుడు.రెండోది ప్రలంభఘ్నుడు.

మూడోది బల దేవుడు.నాలుగోది అచ్యుతాగ్రజుడు.

ఐదోది రేవతీ రమణుడు.ఆరోది కామ పాలుడు.

ఏడోది హలాయుధుడు.ఎనిమిదోది నీలాంబరుడు.

తొమ్మిదోది రోహిణేయుడు.పదోది తాలంకుడు.

అంటే తాటి చెట్టు గుర్తు కలవాడని అర్థం.పదకొండోది సంకర్షణుడు.

ఒక గర్భం నుంచి మరొక గర్భానికి లాగబడిన వాడని అర్థం.పన్నెండోది సీరపాణి, పదమూడోది కాళినేఛేదనుడు.

అంటే కాళిందిని భంగ పరచినవాడని అర్థం.

బలరాముడు ఎప్పుడూ శ్రీ కృష్ణుడితోనే ఉండేవాడు.అన్ని వేలళా తోడుగా ఉంటూనే తమ్ముడిని ‌ప్రేమగా చూసుకునేవారట.ఈయన భార్య పేరు రేవతి.

ఇతడి ఆయుధం నాగలి.ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశనే మార్చారని పురాణాలు చెబుతున్నాయి.

మరో సారి హస్తినాపురాన్నే తన ఆయుధమైన నాగలితో యమునలో కలపాలని చూశారట.అంతే కాకుండా వీరు కురక్షేత్ర యుద్ధమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేశారని పురాణాలు చెబుతున్నాయి.

How Many Names Have Bala Ramudu , Bala Ramudu , Devotional, Sri Krishnudu, Telugu Devotional - Telugu Bala Ramudu, Devotional, Sri Krishnudu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube