ఈ ఏడాది చైత్ర నవరాత్రులు( Chaitra Navaratri ) ఏప్రిల్ 9వ తేదీ నుంచి మొదలయ్యాయి.ఇవి ఏప్రిల్ 17వ తేదీన రామ నవమి రోజుతో ముగుస్తాయి.
ఈ సమయంలో మాతృమూర్తి వివిధ రూపాలను భక్తితో పూజించడం ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.జీవితంలోని అన్ని కష్టాలను తొలగించి ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని చెబుతారు.
నవరాత్రి తొమ్మిది రోజులు భగవతీ దేవి( Bhagavathi Devi ) తొమ్మిది రూపాలను పూజిస్తారు.చైత్ర నవరాత్రులలో దుర్గామాతను ఆరాధిస్తారు.
తొమ్మిది రోజుల పండుగలో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన రంగుతో ముడిపడి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.దుర్గామాత తొమ్మిది రూపాలలో ప్రతి ఒక్కటి వేరువేరు రంగులతో సంబంధం కలిగి ఉంటుందని భక్తులు నమ్ముతారు.

నవరాత్రుల మొదటి రోజు అంటే ఏప్రిల్ 9వ తేదీన ఉదయం ఆరు గంటల 25 నిమిషాల నుంచి 10 గంటల 27 నిమిషాల వరకు ఘటస్థాపనకు ఉత్తమమైన సమయం అనీ నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:48 నిమిషముల వరకు ప్రారంభమయ్యే అభిజిత్ ముహూర్తం( Abhijit Muhurt ) లో కూడా ఘటస్థాపన చేయవచ్చు.ఈ రోజున మాతా శైలపుత్రిని పూజిస్తారు.అమ్మవారికి ఎరుపు రంగు బట్టలు కట్టాలి.ఎరుపు రంగు శక్తిని, ప్రేమను సూచిస్తుంది.అలాగే ఏప్రిల్ 10వ తేదీన వసంత నవరాత్రులలో రెండవ రోజు బ్రహ్మచారిణి మాతను పూజిస్తారు.
బ్రహ్మచారిణి అవతారంలో ఉన్న అమ్మవారికి నీలం రంగు( Blue Color ) అంటే ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే వసంత నవరాత్రులలోనీ మూడవరోజు గౌరీదేవిని( Gouri Devi ) పూజిస్తారు.గౌరీ మాతకు పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం.ఏప్రిల్ 12వ తేదీన శుక్రవారం ఉగాది సందర్భంగా నిర్వహించే నవరాత్రికి మహోత్సవాల్లో నాలుగో రోజు కూష్మాండా దేవుని పూజిస్తారు.
కూష్మాండాదేవికి ఆకుపచ్చ రంగు అంటే ఎంతో ఇష్టమని పురాణాలలో ఉంది.ఏప్రిల్ 13వ తేదీన వసంత నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజున నాగ పూజ చేస్తారు.ఈ రోజు న స్కంద మాతను బూడిద రంగు వస్త్రాలతో అలంకరించి పూజిస్తారు.ఏప్రిల్ 14వ తేదీన అమ్మవారిని పూజిస్తారు.
కాత్యాయనీ మాత( Katyayani Mata )కు నారింజ రంగు అంటే ఎంతో ఇష్టం.
ఏప్రిల్ 15వ తేదీన వసంత నవరాత్రులలో ఏడవ రోజు మాత కాళరాత్రి దేవిని పూజిస్తారు.
కాళరాత్రి దేవిని పూజించిన వారు అకాల మరణాన్ని ఎదుర్కోరు.అమ్మవారి ఈ రూపం భక్తులను మరణం నుంచి రక్షిస్తుంది.
రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంత పరిచేందుకు తెల్లటి వస్త్రాలు కట్టి పూజలు జరపాలని పురాణాలలో ఉంది.అలాగే ఏప్రిల్ 15వ తేదీన మహా గౌరీ రూపాన్ని పూజిస్తారు.
మహా గౌరీ అమ్మవారికి పింక్ కలర్ అంటే ఎంతో ఇష్టం.ఏప్రిల్ 17వ తేదీన వసంత నవరాత్రులు జరుపుకుంటారు.
చివరి రోజు అయినా తొమ్మిదవ రోజు ప్రతి పల్లె శోభామయానంగా రూపుదిద్దుకుంటుంది.చివరి రోజు శ్రీరామనవమి, శ్రీరామచంద్రుడు సీతాదేవి కల్యాణం( Seethadevi Kalyanam ) జరుపుతారు.
పానకం, వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తారు.ఈ రోజు దైవత్వ దేవత సిద్ధిరాత్రిని జరుపుకుంటారు.
లోక కళ్యాణం కోసం ఆ రోజు రామనామాన్ని జపిస్తారు.