హిందూమతంలో దైవారాధనకు విశిష్ట స్థానం ఉంది.మత గ్రంథాలలో ప్రదోష వ్రతానికి( Pradosh Vrat ) చాలా ప్రాముఖ్యత ఉంది.
ఈ నెల రెండవ ప్రదోష వ్రతం 15వ తేదీన ఆచరించనున్నారు.ఈరోజున మహాదేవుని పూజించడం వలన భక్తులు కోరుకున్న ఫలితాలను పరమశివుడు( Parama Shivudu ) ఇస్తాడని విశ్వాసం.
భక్తులు తనను జలంతో అభిషేకం( Abhisekam ) చేసిన భక్తుల పట్ల పరమశివుడు ప్రసన్నుడే తన కష్టాలన్నీ తొలగించి అనుగ్రహిస్తాడని విశ్వాసం.ఇక ప్రదోష వ్రతం సమయంలో శివుడిని పూజించడం వలన ఇంట్లో సంతోషం, శాంతి వాతావరణం నెలకొంటుంది అని నమ్ముతారు.
మహాదేవుని ఎలా పూజించాలంటే, ప్రదోషకాలాన్ని శివుడిని ఆరాధించడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
అందుకే ప్రదోష వ్రతం రోజున తెల్లవారుజామున నిద్ర లేచి అభ్యంగ స్నానం చేయాలి.అలాగే ఉపవాస దీక్ష( Fasting ) కూడా చేపట్టాలి.రోజంతా శివుడి నామ జపం చేస్తూ ఉండాలి.
ఇక సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ప్రదోషకాలంలో శివ పూజ ప్రారంభించాలి.పూజ అయ్యాక పంచామృతం, నీటితో శివునికి స్నానమాచరించి ఆపై దీపం వెలిగించి పూజను ప్రారంభించాలి.
అలాగే పూజ సమయంలో బిల్వపత్రాలు, ఉమ్మెత్త పువ్వులు, రుద్రాక్ష, గంగా జలాన్ని శివయ్యకు సమర్పించాలి.ఈ విధంగా పూజ చేయడం వలన శివుడు సంతోషించి భక్తులను అనుగ్రహిస్తాడని నమ్మకం.
ప్రదోష వ్రతం రోజున ముందుగా పూజ గదిని శుభ్రంగా చేసుకోవాలి.
సూర్యోదయం నుంచి ఉపవాస దీక్షలు చేపట్టాలి.ముఖ్యంగా మాంసం, మద్యం మొదలైన వాటికి దూరంగా ఉండాలి.అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
ఉపవాస దీక్ష చేపట్టినప్పుడు అబద్ధాలు చెప్పకూడదు.ఉపవాసం సమయంలో వెల్లుల్లి లేదా ఉల్లిపాయను ఆహారంలో తీసుకోకూడదు.
అలాగే ఉపవాస దీక్ష సమయంలో పేదలకు అన్నదానం చేయడం ఎంతో మంచిది.అలాగే సాయంత్రం పూజ అనంతరం జాగరణ చేస్తూ ఉండాలి.
ఇక ఈ ప్రదోష వ్రతం రోజున తెలియకుండా కూడా నల్లని దుస్తులను అస్సలు ధరించకూడదు.
DEVOTIONAL