నవమాసాలు కని పెంచిన కన్న తల్లిని చంపింది ఓ కసాయి కూతురు.ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ మహిళ మికో లేఅవుట్ లో భర్త, అత్త మరియు తల్లితో కలిసి జీవనం సాగిస్తుంది.అయితే ఆమె తల్లి తరుచూ గొడవ పడుతుందని ఆగ్రహానికి గురైన మహిళ ఆహరంలో నిద్రమాత్రలు కలిపి హత్య చేసింది.
అనంతరం తల్లి మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టిన మహిళ నేరుగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది.హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.