తమిళనాట స్టార్ కమెడియన్ గా వడివేలు( Comedian Vadivelu ) దాదాపు 25 సంవత్సరాలుగా కమెడియన్ గా ఏకచిత్రాధిపత్యం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే నటుడిగా వడివేలు ఎంతటి పేరు సంపాదించుకున్నారో మనం చూసాం కానీ అంతే స్థాయిలో దిగజారిపోయి వ్యాఖ్యలు కూడా చేసి ఆ పేరును పోగొట్టుకున్నారు.
చాలా మట్టుకు ఇండస్ట్రీలో అతనిని ఈగోయిస్ట్ అంటూ ఉంటారు.అతని వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా సినిమాతో సంబంధం లేకుండా రాజకీయపరమైన అంశాల్లో వేలు పెట్టి చిక్కుల పాలయ్యారు.
తమిళ సార్ హీరో విజయ్ కాంత్( Vijay Kanth ) రాజకీయ రంగంలోకి ప్రవేశించాక అతనిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విజయ్ కాంత్ అభిమానులు దాదాపు వడివేలుని కొట్టినంత పని చేశారు.విజయ్ కాంత్ ని రాజకీయాల్లోంచి( Politics ) తరిమేయడమే తన జీవిత ధ్యేయమంటూ వడివేలు కామెంట్స్ చేయడంతో అసలు వివాదం మొదలైంది.
ముందు నుంచి ఎలాంటి విభేదాలు ఉన్నాయో తెలియదు కానీ విజయకాంత్ మరియు వడివేలు ఒకరంటే ఒకరు మండి పడిపోతూ ఉంటారు.
ఇక విజయకాంత్ పై వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానులు ఒకరోజు వడివేలు ఇంటిపై దాడి కూడా చేశారు.ఆ సమయంలో వడివేలు బాత్రూంలో దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు ఇలా రాళ్ల దాడి చేయడంపై విజయ్ కాంత్ అభిమానులు( Vijaykanth Fans ) స్పందించారు ఇకపై తమ అభిమాన నటుడు పై మరో మారు వ్యాఖ్యలు చేస్తే ఈసారి రాళ్ళ దాడితో కాదు ఇంకోలా తమ ప్రతాపం చూపిస్తామంటూ దురుసుగా ప్రవర్తించారు.
నిజానికి వడివేలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి అయినా కూడా విజయకాంత్ పై ఉన్న కోపంతో దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారు దాంతో ఇలా రాళ్ల దాడికి గురయ్యారు.ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు ఎన్నో వివాదాల్లో ఇరుక్కోవడం విశేషం.అయినా కూడా అతడికి సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
అతడిని తమిళ ఇండస్ట్రీ( Kollywood ) దాదాపు బ్యాన్ చేసే పరిస్థితి వచ్చింది.తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు వడివేలు.
మరి ఈ సంబరం ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.