కువైట్‌‌కు అండగా నిలుస్తాం .. ప్రవాస భారతీయులతో నరేంద్ర మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) కువైట్‌లో( Kuwait ) పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.శనివారం కువైట్‌లో దిగిన వెంటనే.

 Pm Narendra Modi Hails Indian Diaspora In Kuwait Details, Pm Narendra Modi ,indi-TeluguStop.com

మోడీ భారతీయ ఇతిహాసాలు రామాయణం ,( Ramayanam ) మహాభారతాలను( Mahabharata ) అరబిక్‌లోకి అనువదించి ప్రచురించిన అబ్ధుల్లా అల్ బరూన్, అబ్ధుల్ లతీఫ్ అల్ నెసెఫ్‌ను కలిశారు.అల్ బరూన్ రామాయణం, మహాభారతం రెండింటినీ అరబిక్‌లో అనువదించగా .అల్ నెసెఫ్ రామాయణం, మహాభారత అరబిక్ వెర్షన్‌లను ప్రచురించాడు.ప్రధాని మోడీ తన నెలవారీ రేడియో ప్రసార కార్యక్రమం మన్ కీ బాత్‌ ఇటీవలి ఎడిషన్‌లో వీరిద్దరి గురించి.

వారి ప్రయత్నాల గురించి ప్రస్తావించి ప్రశంసించారు.

ఇక ప్రధాని మోడీ విదేశీ పర్యటనల సమయంలో తరచుగా భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు హైలైట్‌గా నిలుస్తుంటాయి.

దీని గురించి చెబుతూ ఇటీవల తన ఎక్స్ పోస్ట్‌లో ప్రస్తావించారు నరేంద్ర మోడీ.నేను ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా, భారతీయ చరిత్ర , సంస్కృతి కనిపిస్తూనే ఉంటుందన్నారు.

ఆస్ట్రియాలో వందేమాతరం ఆలపించడం, పోలాండ్‌లో దాండియా, లావోస్‌లో రామాయణాన్ని ప్రదర్శించిన వ్యక్తుల గురించి ప్రధాని వెల్లడించారు.

Telugu Arabic, India Kuwait, Indian Diaspora, Kuwait, Kuwaitindian, Kuwait Nris,

ఇకపోతే.కువైట్ పర్యటన సందర్భంగా విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం లభించింది.ప్రవాస భారతీయులు( NRI’s ) ఎయిర్‌పోర్ట్‌కు భారీగా చేరుకోగా .వారందరినీ మోడీ పేరు పేరునా పలకరించారు.ప్రత్యేకించి 101 ఏళ్ల మాజీ ఐఎఫ్ఎస్ అధికారి మంగళ్ సేన్ హుండాను కలవాల్సిందిగా ఆయన మనవరాలు ఎక్స్‌లో చేసిన అభ్యర్ధనను అంగీకరించిన మోడీ.

కువైట్‌లో దిగిన వెంటనే పెద్దాయనను పలకరించారు.

Telugu Arabic, India Kuwait, Indian Diaspora, Kuwait, Kuwaitindian, Kuwait Nris,

కువైట్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన హాలా మోడీ( Hala Modi ) కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ .తన పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు.కువైట్ సమాజానికి భారతీయతను పరిచయం చేశారంటూ ప్రవాస భారతీయులను ప్రశంసించారు మోడీ.

కువైట్ నిర్మాణానికి అవసరమైన ఆవిష్కరణలు, స్టీల్, సాంకేతికత, మానవ వనరులు భారత్ వద్ద పుష్కళంగా ఉన్నాయని వీటి సాయంతో కువైట్‌కు కొత్త శక్తిని ఇస్తామని నరేంద్ర మోడీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube