ఈజిప్టులో( Egypt ) పురావస్తు శాస్త్రవేత్తలు ఒక సంచలన ఆవిష్కరణ చేశారు.ఆక్సిరిన్‌చస్‌లోని( Oxyrhynchus ) ఒక పురాతన స్మశాన వాటికలో 13 మమ్మీలను కనుగొన్నారు.
వాటికి బంగారు నాలుకలు, బంగారు గోళ్లు( Gold Tongues Nails ) ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఈ మమ్మీలను ఒక సమాధి గుంటలో గుర్తించారు, అది మూడు రహస్య గదులు ఉన్న ఒక పెద్ద హాలుకు దారి తీస్తుంది.
అంతేకాదు, ఆ ప్రాంతంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని దేవతల ఆచారాలకు సంబంధించిన చిత్రాలు కూడా అక్కడ కనిపించాయి.
ప్రాచీన ఈజిప్షియన్లు బంగారం అంటే చాలా పవిత్రంగా భావించేవారు.
దాన్ని “దేవుళ్ల శరీరం” అని కూడా పిలిచేవారు.మరణించిన తర్వాత కూడా ఆత్మ మాట్లాడగలగాలనే ఆశతో వారు మమ్మీల( Mummies ) నోళ్లలో బంగారు నాలుకలను ఉంచేవారు.
కానీ బంగారు గోళ్లు మాత్రం ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు.ఇది ఒక కొత్త మిస్టరీని క్రియేట్ చేస్తోంది.
ఈ మమ్మీలు క్రీస్తుపూర్వం 304 నుండి క్రీస్తుపూర్వం 30 మధ్య కాలానికి చెందిన టోలెమిక్( Ptolemaic ) యుగానికి చెందినవిగా గుర్తించారు.ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌లోని అల్-బహ్నాసా ప్రాంతంలో ఇటువంటి ఆవిష్కరణ జరగడం ఇదే మొదటిసారి అని ఈజిప్టు పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖ తెలిపింది.ప్రముఖ ఈజిప్టాలజీ ప్రొఫెసర్ సలీమా ఇక్రమ్ ఈ మమ్మీలు ఆ ప్రాంతంలోని ముఖ్యమైన దేవాలయాలు, జంతువులను ఆరాధించే సంప్రదాయాలతో సంబంధం ఉన్న ఉన్నత వర్గాల వారికి చెందినవని అభిప్రాయపడ్డారు.
మమ్మీలతో పాటు, పురావస్తు శాస్త్రవేత్తలు 29 బంగారు తాయెత్తులను కూడా కనుగొన్నారు, వాటిలో స్కారాబ్ ఆకారపు తాయెత్తులు కూడా ఉన్నాయి.అంతేకాదు, సమాధి గదిలో ఒక అందమైన గోడ పెయింటింగ్ కూడా కనుగొన్నారు.ఆ పెయింటింగ్‌లో నట్ వంటి ఈజిప్షియన్ దేవతలను చూడవచ్చు.
ఈజిప్టాలజిస్ట్ ఫ్రాన్సిస్కో టిరాడ్రిట్టి పెయింటింగ్స్ అద్భుతమైన నాణ్యత, ప్రకాశవంతమైన రంగులను ప్రశంసించారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, మరొక బృందం దక్షిణ అసాసిఫ్ నెక్రోపోలిస్‌లోని లక్సోర్ సమీపంలో 11 సీలు చేసిన సమాధులను కనుగొన్నారు.12-13వ రాజవంశాలకు చెందిన ఈ సమాధులలో పురుషులు, మహిళలు, పిల్లల అస్థిపంజరాలు ఉన్నాయి, ఇవి తరతరాలుగా ఉపయోగించిన కుటుంబ సమాధులని సూచిస్తున్నాయి.