సినిమా ఇండస్ట్రీ లో నటులు స్టార్ హీరోలుగా ఎదిగినప్పుడు వాళ్ల అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ ఇండస్ట్రీకి రావడం జరుగుతుంది అలా ఇప్పటి వరకు చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు, వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కాకుండా మళ్ళీ వెనుదిరిగి వెళ్లిన వారు కూడా ఉన్నారు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయిన అన్నలను, తమ్ములను, అక్కలను, చెల్లెళ్లను పోగొట్టుకొని ఒంటరిగా ఉన్న వారు ఎవరో ఇప్పుడు చూద్దాం…
నందమూరి జానకిరామ్
నందమూరి హరికృష్ణ కొడుకుల్లో పెద్దవాడు జానకిరామ్. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళు హీరోలుగా చాలా సినిమాల్లో నటించారు ప్రస్తుతం నటిస్తున్నారు కూడా,జానకిరామ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు ఆయన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ని చూసుకుంటూ ఉంటారు.అయితే ఆ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ కన్నుమూశారు.హరికృష్ణ కొడుకుల్లో పెద్దవాడు మరణించడం వలన ఆయన తర్వాత ఉన్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మాత్రం తోబుట్టువును పోగొట్టుకున్న బాధలో ఉన్నారు అని చెప్పాలి…
భరత్
భరత్ ఎవరు అంటే రవితేజ వాళ్ళ తమ్ముడు.రవితేజ ఇండస్ట్రీ కి ఏ సపోర్టు లేకుండా వచ్చి చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఆ తర్వాత హీరోగా అవకాశాలను అందుకని స్టార్ హీరోగా ఎదిగిపోయారు.తాను హీరో అయిన తర్వాత తన తమ్ములను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు కానీ వాళ్లు పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.రవితేజకి ఇద్దరు తమ్ముళ్ళు పెద్దాయన రఘు, చిన్నాయన భరత్.
వీళ్లిద్దరి ని హీరోగా పరిచయం చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు దాంతో భరత్ కృష్ణవంశీ తీసిన రాఖి సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.అలాగే రామరామ కృష్ణకృష్ణ, దోచేయ్ లాంటి సినిమాల్లో ఆయన వేసిన పాత్రలకి మంచి గుర్తింపు లభించింది.
అయితే ఆ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ మరణించడం జరిగింది.రవితేజ మంచి హీరోగా గుర్తింపు పొందినప్పటికీ తన సొంత తమ్ముడిని కోల్పోవటం అనేది బాధను కలిగించే విషయం…
ప్రేమ్ చంద్
ప్రేమ్ చంద్ ఎవరు అంటే ప్రముఖ హీరో గోపీచంద్ వల్ల అన్నయ్య వీళ్లిద్దరు అప్పట్లో ప్రముఖ దర్శకుడు అయిన టి కృష్ణ కొడుకులు.అయితే ప్రేమ్ చంద్ ఒక సినిమాని డైరెక్ట్ చేస్తుండగా కారు ప్రమాదం జరిగి తను మరణించాడు.గోపీచంద్ యజ్ఞం, రణం, లక్ష్యం, లౌక్యం లాంటి సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.తను ఎంత గుర్తింపు సాధించుకున్నప్పటికీ తనతో ఆ సంతోషాన్ని పంచుకోవడానికి తన నాన్న గాని, అన్నయ్య గాని లేడని ఎప్పుడు గోపీచంద్ బాధపడుతూ ఉంటాడు…
ఆర్తి అగర్వాల్
తెలుగులో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్తి అగర్వాల్ మాత్రమే.అలాంటి ఆర్తి అగర్వాల్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించింది.అయితే కొన్ని కారణాల వలన సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అయింది,ఆ క్రమంలో ఆమె ఎక్కువ లావు అయింది.అయితే లావు తగ్గి మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అని అనుకొని లావు తగ్గడానికి సర్జరీ చేయించుకునే క్రమంలో ఆపరేషన్ ఫెయిల్ అయి చనిపోయింది.
ఆవిడ చెల్లి అయిన అదితి అగర్వాల్ కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపును సాధించింది.అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సాధించింది.
అక్క సపోర్ట్ చూసుకొని అదితి ఇండస్ట్రీకి వచ్చింది కానీ ప్రస్తుతం అక్క ప్రాణాలతో లేకపోవడం వలన తీవ్ర మనస్తాపానికి గురైంది…
ఇండస్ట్రీలో వాళ్ళెంత టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ దాన్ని పంచుకునే తోబుట్టువులు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి…